అజంగఢ్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
(ఆజంగఢ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అజంగఢ్ జిల్లా ఒకటి. అజంగఢ్ డివిజన్‌లో భాగమైన ఈ జిల్లాకు ముఖ్య పట్టణం ఆజంగఢ్.

ఆజంగఢ్ జిల్లా
आजमगढ ज़िला
'
ఉత్తర ప్రదేశ్ పటంలో ఆజంగఢ్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఆజంగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఆజంగఢ్
ముఖ్య పట్టణంఆజంగఢ్
మండలాలు7
విస్తీర్ణం
 • మొత్తం3,054 కి.మీ2 (1,179 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం46,16,509
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.69%
Websiteఅధికారిక జాలస్థలి
అజంగఢ్‌లోని జమియాతుల్ అష్రాఫియా

పేరు వెనుక చరిత్ర

మార్చు

జిల్లా కేంద్రం అజంగఢ్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. విక్రంజిత్ కుమారుడు అజం 1665లో ఈ పట్టణాన్ని స్థాపించాడు. విక్రంజిత్ గౌతమ రాజపుత్రుల సంతతికి చెందినవాడు. గౌతమ రాజపుత్రులు నిజామాబాదు పరగణాకు చెందినవారు. వీరు ఇస్లాం మతం స్వీకరించారు. ఆయనకు ఇద్దరు కుమారులు (అజం, అజ్మత్) ఉన్నారు.[1] ఇది దుర్వాసమహర్షి నివసించిన ప్రాంతం అని విశ్వసిస్తున్నారు. దుర్వాసుని ఆశ్రమం ఫూల్పూర్ తాలూకాకు ఉత్తరాన [2] తమసా, మఝుయీ నదుల మధ్య ఉంది.

చరిత్ర

మార్చు

కాలనీ శకం

మార్చు

ఆజంగఢ్ హిందూ, ముస్లిం భూస్వాములు (రౌత్రాలు) ఇరువురు 1857 సిపాయీ కలహంనికి సహాయం అందించారు. 1857 జూన్ 3 న 17వ " రెజిమెంట్ ఆఫ్ నేటివ్ ఇంఫాంటరీ మ్యూటినియడ్ " అజంగఢ్ వారి అధికారులు కొందరిని హత్యచేసి ప్రభుత్వ నిధిని ఫైజాబాదుకు తీసుకుపోయారు. గూర్ఖాలు, తిరుగుబాటుదార్ల యుద్ధానికి ఈ ప్రాంతం వేదికగా మారింది. 1858 నాటికి కాలనియల్ కెల్లీ పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చాడు. తిరుగుబాటు దారులలో ముఖ్యుడు జనాబ్ లాల్ మొహమ్మద్ చివ్తహ్విన్. తరువాత బ్రిటిషు ప్రభుత్వం పలువురు భూస్వాములను అణచివేసింది.[3] తరువాత ఆజంగఢ్ ప్రజలు సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా (1942) వంటి జాతీయ ఉద్యమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.[1] ది చారిత్రక, సాంఘిక సంస్కరణలు, నేషనలిస్ట్ మహాపండిత్ రాహుల్ శాంక్రియయన్ " ఈ జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించాడు.

భౌగోళికం

మార్చు

అజంగఢ్ జిల్లా వైశాల్యం 3054 చ.కి.మీ. జిల్లా గంగా, ఘఘ్రా నదుల మధ్య ఉంది. .[1] జిల్లా ఆగ్నేయ సరిహద్దులో జౌన్‌పూర్, నైరుతీ సరిహద్దిలో సుల్తాన్‌పూర్, పశ్చిమ సరిహద్దులో అంబేద్కర్ నగర్ జిల్లాలు ఉన్నాయి.[4]

  • జిల్లాలు అజంగఢ్ జిల్లా 7 తాలూకాలు , జిల్లాలో 22 మండలాలు , 4,106 గ్రామాలు (3,792 నివాసిత గ్రామాలు, 314 నిర్జన గ్రామాలు) ఉన్నాయి.[1]

ప్రధానమైన 12 పట్టణాలు (ఖస్బ)

మార్చు
  • ఆజంగఢ్
  • బిలరీగంజ్
  • లాల్‌గంజ్
  • ముబారక్‌పూర్
  • సరాయ్ మీర్
  • ఫూల్పూర్
  • జియంపూర్
  • అత్రౌలీ
  • అంబారి
  • మాహుల్
  • మర్తింగంజ్
  • సాగరి
  • మేహ్‌నగర్

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఆజంఘడ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,616,509,[6]
ఇది దాదాపు. బోస్నియా, హర్జిగోవిన దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. సౌత్ కరోలినా నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 30 వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 1139 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.17%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 1007:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 72.69%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. దాదాపు సమానం
2001 జనసంఖ్య 3,939,915
జిల్లావైశాల్యం 972 చ.కి.మీ
నగరప్రాంత జనసంఖ్య 297,300
గ్రామీణ జనసంఖ్య 3,642,616
పురుషుల సంఖ్య 1,950,414
స్త్రీల సంఖ్య 1,989,501
అక్షరాస్యత 57%.[1]

భాషలు

మార్చు

జిల్లాలో హిందీ, అవధి, ఉర్దూ, ఆంగ్లం, భోజ్‌పురి భాషలు వాడుకలో ఉన్నాయి.[9]

పర్యాటక ఆకర్షణలు

మార్చు
  • జమియాతుల్ ఫలాహ్ (ఖుర్ఆన్ అధ్యయనం కోసం ఆసియాలోని విశ్వవిద్యాలయం) (విశ్వవిద్యాలయం ఇస్లామిక్ స్టడీస్ లో విద్య అలాగే ఆధునిక విద్యకు అంటారు).
  • దారుల్ ముసనాఫీన్ (ఆసియాలోనే అతిపెద్ద అరబ్బీ లైబ్రరీ)
  • అల్జమియాతుల్ అష్రాఫియా (ఆసియాలోనే అతిపెద్ద అరబిక్ విశ్వవిద్యాలయం)
  • షిబ్లీ నేషనల్ కాలేజ్
  • కేంద్రీయ విద్యాలయ
  • డి.ఎ.వి. కాలేజ్
  • రాజేంద్ర ప్రసాద్ కాలేజ్ మేనేజ్మెంటు
  • డెంటల్ కోల్లెజ్

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • రాహుల్ సాంకృత్యాయన్ - హిందీ ప్రయాణం తండ్రి సాహిత్యం - నుండి కనైలా విలేజ్
  • అయోధ్య ప్రసాద్ ఉపాధ్యాయ- హిందీ కవి - నుండి నిజామాబాద్ (ఉత్తర ప్రదేశ్)
  • ప్రేమ్ చంద్ పాండే - భారత శాస్త్రవేత్త, విద్యా
  • మజ్రోహ్ సుల్తాన్‌పురి - ఉర్దూ కవి, రచయిత, గేయరచయిత - నుండి నిజామాబాద్ (ఉత్తర ప్రదేశ్)
  • శ్యామ్ నారాయణ్ పాండే - రచయిత, కవి -దుంరావ్ గ్రామం నుండి, (ఇప్పుడు మావు జిల్లాలో అయితే ఆ సమయంలో ఆజమ్గర్హ జిల్లాలో ఉంది)
  • లక్ష్మీ నారాయణ్ మిశ్రా - కవి - బస్తీ నుండి (అప్పుడు ఆజమ్గర్హ జిల్లాలో ఇప్పుడు మావు జిల్లాలో కానీ ఉంది)
  • షేక్ షమిన్ అహ్మద్ - సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ శాసన సభ్యులు సుందనిపూర్ నుండి షుదిన్‌పూర్ - బాంబే కోసం.
  • హమీదుద్దీన్ ఫరాహి - మత పండితుడు, విద్యావేత్త, రచయిత -ఫెర్హా గ్రామం నుండి
  • షిబ్లీ నోమాని - ఇస్లామిక్ పండితుడు
  • అమీన్ అహసాన్ - ఇస్లామిక్ పండితుడు -బంహూర్ గ్రామం నుండి
  • గజేంద్ర సింగ్ - భారత టెలివిజన్ నిర్మాత, దర్శకుడు
  • విభూతి నారాయణ్ రాయ్- మాజీ ఐపిఎస్ అధికారి, మాజీ వైస్ ఛాన్సలర్ - మహాత్మా మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ

బయటి లింకులు

మార్చు

అధికారిక వెబ్‌సైటు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Azamgarh". Azamgarh district administration. Archived from the original on 2010-07-29. Retrieved 2014-12-16.
  2. ""Durvasa Ashram in Azamgarh official public information web page"". Archived from the original on 2001-06-07. Retrieved 2014-12-16.
  3. http://chestofbooks.com/reference/Encyclopedia-Britannica-1/Azamgarh.html
  4. "Azamgarh". UP online. Archived from the original on 2010-07-14. Retrieved 2014-12-16.
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bosnia and Herzegovina 4,622,163 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Carolina 4,625,364
  9. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.