ఆజీజుర్రహ్మాన్‌ ముహమ్మద్‌

ఆజీజుర్రహ్మాన్‌ ముహమ్మద్‌ .... ప్రముఖ కవి రచయిత ఎస్‌.ఎం. మలిక్‌, మౌలానా ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌ల ప్రేరణతో తెలుగు, ఉర్దూ భాషలో ప్రావీణ్యం. గీటురాయి పత్రికలో పనిచేస్తూ పలు ధార్మిక వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు. ప్రస్తుతం కువైట్ లో నుండి వెలువడుతున్న 'నెలవంక' మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు.

బాల్యముసవరించు

ఆజీజుర్రహ్మాన్‌ ముహమ్మద్‌ ... కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం సుబ్బిచెర్వు గ్రామములో 1957 అక్టోబరు 12 న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షరీఫాబి, ముహమ్మద్‌ యూనుస్‌. చదువు: బి.ఎ. వ్యాపకం: ధార్మిక సేవలు, జర్నలిస్ట్‌. ప్రస్తుత నివాసం కువాయిట్.

రచనా వ్యాసంగముసవరించు

1979లో గీటురాయి వారపత్రికలో తొలిరచన ప్రచురణ ద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం అయ్యింది. ప్రముఖ కవి రచయిత ఎస్‌.ఎం. మలిక్‌, మౌలానా ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌ల ప్రేరణతో తెలుగు, ఉర్దూ భాషలో ప్రావీణ్యం. గీటురాయి పత్రికలో పనిచేస్తూ పలు ధార్మిక వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు.

ప్రచురణలుసవరించు

వీరి వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన సుమారు 70 గ్రంథాలను రాష్ట్రంలోని వివిధ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ఆ గ్రంథాలలో 1. హదీసు మకరందం, 2. తఫ్సీర్‌ అహ్సనుల్‌ భయాన్‌ (ఖుర్‌ఆన్‌ అనువాదం), 3. దేవుడొక్కడే, 4. రుజుమార్గం, 5. రమజాన్‌ శుభాలు అను గ్రంథాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తఫ్సీర్‌ అహ్సనుల్‌ భయాన్‌' పేరుతో తెలుగులో అనువదించిన రెండువేల ఎనిమిది వందలడెభై పుటలకు పైగాగల బృహత్తర గ్రంథం ఖ్యాతికి కారణమైంది. ప్రస్తుతం కువైట్ లో నుండి వెలువడుతున్న 'నెలవంక' మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు.

లక్ష్యముసవరించు

ప్రజాభిప్రాయాన్నిసదాశయాలకు అనుగుణంగా అక్షరంతో మలచాలన్నది వీరి లక్ష్యము.

మూలాలుసవరించు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 47

మూలాల జాబితాసవరించు