ఆదార్ పూనావాలా
ఆదార్ పూనావాలా వ్యాక్సీన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.[1]
ఆదార్ పూనావాలా | |
---|---|
జననం | 1981 జనవరి 14 |
జాతీయత | భారతదేశం |
విద్య | ది బిషప్స్ స్కూల్, పూణే సెయింట్ ఎడ్మండ్స్ స్కూల్, కాంట్బెరీ |
విద్యాసంస్థ | లండన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ |
బిరుదు | సీఈవో, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
పదవీ కాలం | 2011–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నతాషా పూనావాలా |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
విద్యాభాస్యం
మార్చుఆదార్ పూనావాలా పూణేలోని ది బిషప్స్ స్కూల్, కాంట్బెరీలోని సెయింట్ ఎడ్మండ్స్ స్కూల్ లో ఉన్నత విద్యను అభ్యసించాక లండన్ లోని లండన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్[2] నుండి పట్టభద్రుడయ్యాడు.
వ్యాపారవేత్తగా
మార్చులండన్ నుండి తిరిగి వచ్చి 2001లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేరాడు. ఆయన కంపెనీలో చేరగా విదేశీ ఎగుమతులపై ద్రుష్టి పెట్టి దాదాపు 35 దేశాలకు వారి కంపెనీ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. 2015 నాటికీ వారి ఉత్పత్తులు దాదాపు దేశాలకు విస్తరించాడు. సీరమ్ కు 85 % లాభాలు విదేశాలనుండి వస్తుంది.[3] ఆదార్ పూనావాలా 2011లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితుడయ్యాడు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్
మార్చుఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన అస్త్రజెనెకా కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అమెరికన్ వ్యాక్సిన్ డెవలపర్ ‘నోవావ్యాక్స్’తో సీరం సంస్ధ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సీరం ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ముగిసాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఫ్రంట్ లైన్ వారియర్లకు, 2021 ఏప్రిల్ నాటికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆదార్ పూనావాలా తెలిపారు.[4]
ఆదార్ పూనావాలాకు 2021 ఏప్రిల్ 28న కేంద్ర హోంశాఖ ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది.[5][6]
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (27 March 2021). "ఇండియాలో కోవోవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ , సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి - covovax trials finally begin in india says aadar poonawalla". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (25 March 2021). "బ్రిటన్‌లో భారీ ప్యాలస్‌ను అద్దెకు తీసుకున్న ఆదార్ పూనావాలా , సీక్రెట్ గార్డెన్స్ కూడా - adar poonawalla rents uk mansion for heavy price". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today, Kimi Dangor (5 April 2012). "The Poonawallas: Meet India's most reclusive billionaires". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Eenadu (13 December 2020). "అక్టోబర్ నాటికి సాధారణ జీవనం". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ TV9 Telugu (28 April 2021). "Adar Poonawalla: సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు 'వై' కేటగిరీ భద్రత ఏర్పాటు: కేంద్ర హోంశాఖ ప్రకటన - Serum Institute CEO Adar Poonawalla provided Y category security". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (28 April 2021). "Serum Institute CEO Adar Poonawalla gets 'Y' category security cover | India News - Times of India". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.