ఆనంద్ మహీంద్రా

భారతీయ వ్యాపారవేత్త

ఆనంద్ గోపాల్ మహీంద్రా (జననం 1955 మే 1) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్.[4][5][6][7] ముంబైకి చెందిన ఈ బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, స్పేర్స్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, భీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఆఫ్టర్ సేల్స్, రిటైల్‌.. ఇలా పలురకాల వ్యాపారాలున్నాయి.[8]మహీంద్రా అండ్ మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనువడు ఆనంద్ మహీంద్రా నికర విలువ 2020 జనవరి నాటికి $1.6 బిలియన్లుగా అంచనా వేయబడింది.

ఆనంద్ గోపాల్ మహీంద్రా
జననం (1955-05-01) 1955 మే 1 (వయసు 68)
బాంబే, బాంబే స్టేట్, భారతదేశం (ప్రస్తుతం ముంబై)
జాతీయతఇండియన్
విద్యాసంస్థహార్వర్డ్ విశ్వవిద్యాలయం (బి.ఎ., ఎం.బి.ఎ.)[1][2]
వృత్తివ్యాపారవేత్త
నికర విలువUS$1.8 బిలియన్ (ఏప్రిల్ 2021)[3]
బిరుదుఛైర్మన్, మహీంద్రా గ్రూప్
జీవిత భాగస్వామిఅనురాధ మహీంద్రా
పిల్లలుఇద్దరు కుమార్తెలు

ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి.[9] 1996లో ఆయన భారతదేశంలో నిరుపేద బాలికల విద్య కోసమై నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు.[10][11] ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో ఆయనను ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎంపికచేసింది.[12] అదే మ్యాగజైన్ 2011లో ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆనంద్ మహీంద్రా పేరు చేర్చింది.[13] ఆనంద్ మహీంద్రాను ఫోర్బ్స్ (ఇండియా) 2013 సంవత్సరానికి 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది.[14] ఆయనకి 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.[15][16]

జీవితం తొలి దశలో మార్చు

1955 మే 1న ముంబైలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు ఆనంద్ మహీంద్రా జన్మించాడు.[17] ఆయనకు అనుజ శర్మ, రాధికా నాథ్ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.[18] అతను లవ్‌డేల్ లోని లారెన్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసాడు.[19] ఆ తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ మేకింగ్, ఆర్కిటెక్చర్‌ కోర్సులనును అభ్యసించాడు, అక్కడ అతను 1977లో మాగ్నా కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. 1981లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి తన ఎం.బి.ఎ పూర్తి చేసాడు.[9][20]

మూలాలు మార్చు

  1. Bellman, Eric (6 October 2010). "Mahindra Donates $10 Million to Harvard - WSJ.com". Online.wsj. Retrieved 24 January 2011.
  2. Anand Mahindra – Harvard Humanities 2.0
  3. "Forbes profile: Anand Mahindra". www.forbes.com. Retrieved 29 April 2021.
  4. "Who We Are: Leadership – Anand Mahindra". Mahindra. Archived from the original on 10 జూలై 2014. Retrieved 2 July 2014.
  5. Bhupathi Reddy (30 August 2015). "Top 10 Entrepreneurs of India". EntrepreneurSolutions.com. Archived from the original on 26 January 2016.
  6. Srikar Muthyala (29 September 2015). "The List of Great Entrepreneurs of India in 2015". MyBTechLife. Archived from the original on 14 January 2016.
  7. "Pawan Goenka named MD of Mahindra; Anand Mahindra to be executive chairman". Livemint. 11 November 2016.
  8. "Tata in Forbes' top 20 most reputed firms". Times of India. Retrieved 2 July 2014.
  9. 9.0 9.1 "ANAND G. MAHINDRA, MBA 1981". Alumni. 1 January 2008.
  10. "Students: విద్యార్థినుల చదువుకు సాయం". web.archive.org. 2022-07-24. Archived from the original on 2022-07-24. Retrieved 2022-07-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "ET Awards: Mahindra & Mahindra wins Corporate Citizen award for empowering the girl child". Economic Times. 5 September 2017.
  12. "Fortune ranks the World's 50 Greatest Leaders". CNN Money. Retrieved 2 July 2014.
  13. "25 most powerful businesspeople in Asia". CNN Money. Retrieved 2 July 2014.
  14. "anand mahindra is forbes india entrepreneur for the year". CNN Money. Archived from the original on 17 సెప్టెంబర్ 2014. Retrieved 2 July 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  15. "Anand Mahindra, Venu Srinivasan to be honoured with Padma Bhushan; Naukri.com founder to get Padma Shri". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
  16. "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  17. "Anand Mahindra". iloveindia.com. Retrieved 16 October 2017.
  18. "To Think and to Question". harvardmagazine.com. 27 April 2011.
  19. "Kabaddi deserves a league of its own: Anand Mahindra". Economic Times. 10 April 2014.
  20. "Top gun". Business Today. 2 October 2011.