ఆపరేటర్ ఓవర్‌లోడింగ్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారము ఇంకా కొన్ని ఇతర గుర్తులను ఆంగ్లములో ఆపరేటర్లు అంటారు. అవి క్రమంగా +, -, *, % వంటివి. వీటిని ఉపయోగించి వేగంగా అధిక ప్రయోజనం పొందటమే ఆపరేటర్ ఓవర్‌లోడింగ్.
c++
మార్చుc++ కోసము ఈ సంజ్ఞ్యా అధికోపకారిణిని అభివృద్ది చేశారు. c++ ప్రత్యేక లక్షణాలలో ఈ ఆటరేటార్ ఓవర్ లోడింగ్ ముఖ్యమైనది. వాడుకరి సమాచారాన్ని ఇచ్చి, తనకు అనువుగా ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఆపరేటర్లను ఓవర్ లోడ్ చేయటమంటే ఎక్కువ డేటా లేక ఎక్కువ సమాచారము ఇచ్చి ఫలితం రాబట్టటము.
ఉదాహరణ:
గమనిక: ఈ క్రింద వ్రాసిన కోడింగ్ కేవలము అర్ధమవటం కోసమే. c++లో గాని, ఇతర సాఫ్ట్ వేర్లలో పని చేయదు.
ప్రోగ్రాం
a=5. b=6.
a=a+b.
print a.
result = 11.
పై ప్రోగ్రాములో '+' ఉపయోగించి రెండు అంకెలను కూడి ఫలితం ప్రింట్ చేశాము. ఈ '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి లేక అధికంగా ఉపయోగించుకుని ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని కూడవచ్చు.
ఉదాహరణకి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిద్దాము. ఒక నియోజక వర్గములో వంద పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ నియోజక వర్గములో అయిదు పార్టీలు పోటి చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు రోజున వేగంగా ఫలితాలను తెలుసుకుందుకు '+' సంజ్ఞ్యను ఉపయోగించ వచ్చు. అదే ఆపరేటర్ ఓవర్‌లోడింగ్.
గమనిక: ఈ క్రింది ప్రోగ్రాం కేవలం అర్ధం కావటం కోసమే. ఎక్కడా పనిచేయదు.
class party(abc, ijk, lmn, pqr, xyz)
ప్రోగ్రాం
party p;
for(i=0; i<=100;i++)
{
takeinfo p(abc[i], fgh[i], lmn[i], pqr[i], xyz[i])
votes of party abc[i] ?
votes of party fgh[i] ?
votes of party lmn[i] ?
votes of party pqr[i] ?
votes of party xyz[i] ?
abc=abc+abc[i]
fgh=fgh+fgh[i]
lmn=lmn+lmn[i]
pqr=pqr+pqr[i]
xyz=xyz+xyz[i]
}
print total votes = abc, fgh, lmn, pqr, xyz.
abc, fgh, lmn, pqr, xyz అనేవి పార్టీ పేర్లు.
పై ప్రోగ్రామును ఒక్క సారి రన్ చేయగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.
ఇలా అనేక ఆపరేటర్లను ఓవర్ లోడ్ చేసి మనకు కావలసిన ఫలితాన్ని అధికంగా పొందవచ్చు. కానీ ఆ ఆపెరేటార్ ను ప్రాథమిక లక్షణముతో మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే '+' కూడికలకు మాత్రమే వాడాలి. మార్కులు, ఓట్లు, తెర మీద బొమ్మలు, మొదటి పేరు చివరి పేరు ఇలా ఏవైనా కూడికలకు మాత్రమే ఉపయోగించాలి. తెర మీద బొమ్మలు కలిసిపోవటం, విడిపోవటం ఇంకా ఇలా చాలా ఆపెరతార్ ఓవర్ లోడింగ్ వల్లనే సాధ్యపడతాయి.