ఆపిశల వ్యాకరణము

ఆపిశలం తతో జ్ఞయం య త్సురాపిశలిస్మృతం .

అష్టాధ్యాయిలో వాసుప్యాపిశలేః (6-1-12) అన్య్ సూత్రము వలన శబ్దాధికారమున పాణినికి ఆపిశలి ప్రామాణికుడని తెలియుచున్నది. అపిశల స్యానంతరాపత్యమాపిశలిః. ఇఞ ఆద్యచో వృద్ధిః అని శాబ్దికులన్నారు.అందుచే ఆపిశలుని పుత్రుడు ఆపిశలి. అతడు సామతంత్రప్రణేత యని ప్రసిద్ధి. పౌరాణికమత ప్రకారము ఇతడు యాజ్ఞవల్కుడు ఇతనికి శ్వశురుడు (పిల్లనిచిన మామ).యాజ్ఞవల్కుడు వైశంపాయుడు మేనల్లుడు, శిష్యుడు. తరుణ యాజ్ఞవల్కుడు వృద్ధశాకల్యునితో బ్రహ్మవిచారమున ప్రవృత్తుడయినాడు. (బృహ.ఉప.) కావున ఆపిశలి, శాకల్య, వైశంపాయనాదులు సమకాలికులు. శ్రీ హేమచంద్రరాయ చౌధురీ Political History of Ancient India అని గ్రంథమున 131 పుటలో నిట్లు చెప్పినాడు.

"The Malloi: They occupied the valley of the Hydroates (Ravi) on both banks of the river. Their name represents the Sanskrit Malava Weber informs us that Apisali, one of the teachers cited by Panini speaks of the formation of the compound- 'Khan-draka-Malava'. Dr.Smith pointed out that the Mahabharata coupled the tribes in question as forming part of the Kaurava host in Kurukshetra war."

భారతయుద్ధానంతరము యుధిష్ఠిరుడు ప్రభువయినాడు; అప్పుడే కల్యబ్దము ప్రారంభమయినది. సా.శ..ప్రారంభమగునప్పటికి 3000 కల్యబ్దములు గడచినవి. మత్స్య పురాణము ప్రకారము ఆపిశలి భృగు వంశమున ఒక గోత్రప్రవర్తకఋషి; ఒకప్పుడు పార్వతీదేవి పుణ్యకవ్రతమునకు నిమంత్రితుడు.

ఆపిశలిప్రోక్తవ్యాకరణనామము ఆపిశలము. ఈగ్రంధమును లక్ష్యమున నుంచికొని కాశికావృత్తిలో "ఆపిశలపాణినీయే శాస్త్రే" అని లిఖితమయినది. శ్రీ తత్త్వనిధిమతప్రకారము ఉల్లేఖయోగ్యము లగు నవవ్యాకరణములలో ఆపిశల ఒకటి. "అష్టకా ఆపిశల పాణినీయోః" అమోఘవృత్తిలో అభినవశాకటాయనుడు లిఖించాడు. పాణిని వ్యాకరణమువలెనే ఆపిశలము సూత్రాత్మక గ్రంథమనియు, అధి అష్టకమనికాని, అష్టాధ్యాయి యనికాని ప్రసిద్ధి చెందెననియు దీనివలన గ్రహింపవచ్చును.

బహుకాలము క్రిందటే ఆపిశలము పోయింది. అయినను వివిధగ్రంధములలో ఆపిశలిసూత్ర మేదో ఒకటి కానవచ్చుచుండుటవలన కొందరు పండితులు దీనిని గ్రహించిరి.

  • (1) తురుస్తశమ్యమః సార్వధాతుకాసుచ్చందసి - కాశికలో వామనాచార్యుడు అన్నాడు. శ్రీపాదకృష్ణపండితుడు ఈస్థానమున "A rule of Apisali is given by the Kasika 7-3-95 " అని వ్రాసినాడు.
  • (2) శతాచ్చ ఠన్యతావగ్రంధే - కైయటుడు ప్రదీపములో దీనిని వివరించుచు, నిది ఆపిశలి వచన మన్నాడు.
  • (3) సమయాదీనాం కర్మప్రవచనీయత్వం - అని దుర్గసింహుడు ద్వితీయైనేన అను సూత్రపీఠికలో వ్రాసినాడు.
  • (4) ధేను రనఇసిక ముత్పాదయతి - పదమంజరిలో హరదత్తమిశ్రుడు వ్రాసినాడు.
  • (5) ధాత్వంతరయోగేనా - ఇది ఆపిశలసూత్రము కావచ్చును. కాతంత్రప్రదీపమున "ఆపిశలీయమతే ధాత్వంతరయోగే పాక్షికం కర్మత్వం తదనుసారేణ సంగత మిత్యదోషః" అని యున్నది. ఇది విద్యాసాగరీయప్రదీపము.

మూలాలు మార్చు

1. భారతి మాస సంచిక.