ఆయనకి ఇద్దరు
ఆయనకి ఇద్దరు 1995 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ, ఊహ ప్రధాన పాత్రలు పోషించారు.
ఆయనకిద్దరు (1995 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | జగపతి బాబు, రమ్య కృష్ణ, , ఊహ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తులసి అన్నపూర్ణా క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కథ మార్చు
కృష్ణ మోహన్ కు రమ్య అనే కూతురు ఉంటుంది. కూతురు పుట్టిన తర్వాత అతని భార్య మరణిస్తుంది. అందుకుని కూతుర్ని గారాబంగా పెంచుతాడు. తర్వాత ఆమెకు అమ్మలేని లోటును తీర్చడానికి లక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. లక్ష్మి రమ్యను తన కన్న కూతుర్లానే చూసుకుంటుంది. కొద్ది రోజులకు లక్ష్మికి ఊహ అనే మరో అమ్మాయి పుడుతుంది. పుట్టినప్పుడు రమ్య అసూయ చెందడంతో ప్రతి విషయంలో ఊహను సద్దుకుపొమ్మంటూ ఉంటారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరూ అలాగే కలిసి పెద్దవారవుతారు.
సూర్య పత్రికల్లో నవలలు రాస్తుంటాడు. ఆ నవలల్ని అభిమానిస్తుంటుంది ఊహ.
తారాగణం మార్చు
- సూర్య గా జగపతి బాబు
- రమ్య గా రమ్యకృష్ణ
- ఊహ గా ఊహ
- కృష్ణమోహన్ గా మురళీ మోహన్
- లక్ష్మి గా కవిత
- గుమ్మడి వెంకటేశ్వర రావు
- నాగేశ్వర రావు గా బ్రహ్మానందం
- మైసూర్ జాక్సన్ గా కోట శ్రీనివాసరావు
- ఎ. వి. ఎస్
- యాచకుడిగా ఐరన్ లెగ్ శాస్త్రి
పాటలు మార్చు
- అందాలమ్మో అందాలు , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, ఎం ఎం శ్రీలేఖ
- మధుమాసపు మన్మథ రాగమా, రచన: భువన చంద్ర, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- అరెరే కొత్తగా ఉందిరో , రచన: భువన చంద్ర, గానం.మనో, సుజాత
- ఓ నా చంద్రముఖి , రచన: భువన చంద్ర,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక
- ఓ లైలా లైలా , రచన: భువన చంద్ర,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె ఎస్ చిత్ర .