ఆయనకి ఇద్దరు

(ఆయనకు ఇద్దరు నుండి దారిమార్పు చెందింది)

ఆయనకి ఇద్దరు 1995 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ, ఊహ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 1993 లో హిందీలో వచ్చిన ఐనా అనే సినిమాకు పునర్నిర్మాణం.

ఆయనకిద్దరు
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
రచనఅంకెల్ల (మాటలు), ఇ.వి.వి. సత్యనారాయణ (స్క్రీన్ ప్లే)
నిర్మాతకంటిపూడి సత్యనారాయణ, సి.హెచ్. సత్యనారాయణ
తారాగణంజగపతి బాబు,
రమ్య కృష్ణ, ,
ఊహ
ఛాయాగ్రహణంఅడుసుమిల్లి విజయకుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995
సినిమా నిడివి
156 ని
భాషతెలుగు

కథ మార్చు

కృష్ణ మోహన్ కు రమ్య అనే కూతురు ఉంటుంది. రమ్య పుట్టిన తర్వాత అతని భార్య మరణించడంతో ఆమెను బాగా గారాబం చేస్తాడు. తర్వాత ఆమెకు అమ్మలేని లోటును తీర్చడానికి లక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. లక్ష్మి రమ్యను తన కన్న కూతుర్లానే చూసుకుంటుంది. కొద్ది రోజులకు లక్ష్మికి ఊహ అనే మరో అమ్మాయి పుడుతుంది. పుట్టినప్పుడు రమ్య అసూయ చెందడంతో ప్రతి విషయంలో ఊహను సద్దుకుపొమ్మంటూ ఉంటారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరూ అలాగే కలిసి పెద్దవారవుతారు.

సూర్య జాబిల్లి అనే పత్రికలో నవలలు రాస్తుంటాడు. ఆ నవలల్ని అభిమానిస్తుంటుంది ఊహ. లేఖలు రాస్తూ అతని అభిమానం చూరగొంటుంది. ఊహకు తాతయ్య అంటే ఇష్టం. ఆమె అన్నీ అతనితో పంచుకుంటూ ఉంటుంది. సూర్య ఊహ చిరునామా వెతుక్కుంటూ ఆమె ఇంటికి వస్తాడు. అక్కడ రమ్యను చూసి తనకు ఉత్తరాలు రాస్తుందని ఆమే అని పొరబడి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. రమ్య కూడా అతని ప్రేమలో పడుతుంది. సూర్య పెళ్ళి సంబంధం కోసం తమ ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని, అతను తన కోసమే వస్తున్నాడని ఆశ పడుతుంది ఊహ. కానీ సూర్య వస్తుంది రమ్య కోసమని తెలుసుకుని తన ప్రేమను తనలోనే దాచుకుంటుంది ఊహ.

తారాగణం మార్చు

  • సూర్య గా జగపతి బాబు
  • రమ్య గా రమ్యకృష్ణ
  • ఊహ గా ఊహ
  • కృష్ణమోహన్ గా మురళీ మోహన్
  • లక్ష్మి గా కవిత
  • గుమ్మడి వెంకటేశ్వర రావు
  • నాగేశ్వర రావు గా బ్రహ్మానందం
  • మైసూర్ జాక్సన్ గా కోట శ్రీనివాసరావు
  • ఎ. వి. ఎస్
  • యాచకుడిగా ఐరన్ లెగ్ శాస్త్రి

పాటలు మార్చు

  • అందాలమ్మో అందాలు , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, ఎం ఎం శ్రీలేఖ
  • మధుమాసపు మన్మథ రాగమా, రచన: భువన చంద్ర, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అరెరే కొత్తగా ఉందిరో , రచన: భువన చంద్ర, గానం.మనో, సుజాత
  • ఓ నా చంద్రముఖి , రచన: భువన చంద్ర,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక
  • ఓ లైలా లైలా , రచన: భువన చంద్ర,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె ఎస్ చిత్ర .

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు