ఆరాధన మిశ్రా
ఆరాధన మిశ్రా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
ఆరాధన మిశ్రా (మోనా తివారి) | |||
శాసనసభ్యురాలు
| |||
పదవీ కాలం 16 మే 2014 – ప్రస్తుతం | |||
ముందు | ప్రమోద్ తివారీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంపూర్ ఖాస్ | ||
కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం అక్టోబర్ 2019 | |||
ముందు | అజయ్ కుమార్ లల్లూ | ||
బ్లాక్ ప్రముఖ్
| |||
పదవీ కాలం 2001 – 2016 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ప్రయాగరాజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1974 ఏప్రిల్ 20||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ప్రమోద్ తివారీ , అల్కా తివారి | ||
జీవిత భాగస్వామి | అంబికా మిశ్రా | ||
నివాసం | లక్నో | ||
పూర్వ విద్యార్థి | అలాహాబాద్ యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుఆరాధన మిశ్రా తన తండ్రి ప్రమోద్ తివారి స్ఫూర్తితో 2000లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2011 నుండి 2016 వరకు ప్రతాప్ గఢ్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మూడు పర్యాయాలు పనిచేసింది. ఆమె 2014లో రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2017లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2018లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైంది.[2]
ఆరాధన మిశ్రా 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నగేష్ ప్రతాప్ సింగ్ పై 14741 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (11 March 2022). "42 ఏళ్లుగా ఒకే కుటుంబం.. ఒక్కటే పార్టీ". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
- ↑ The Times of India (10 October 2019). "Aradhana Mishra only woman to be CLP leader in assembly | Lucknow News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ The Economic Times (10 March 2022). "Rampur Khas remains loyal to Congress, sends Aradhana Mishra 'Mona' to UP Assembly for 3rd time". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.