ఆరా సర్గస్యాన్, హకోబ్ కొజొయాన్ మ్యూజియం

జీవిత చరిత్ర మరియు కళల సంగ్రహాలయం.

అరా సర్గస్యాన్, హకోబ్ కొజొయాన్ సంగ్రహాలయం (అర్మేనియన్:Արա Սարգսյանի և Հակոբ Կոջոյանի տուն-թանգարան) గృహ సంగ్రహాలయం, 1934లో సంగ్రహాలయం స్థాపన వరకు అర సర్గస్యాన్, హకిబో కొజొయాన్ నివసించిన  గృహం.

అర సర్గస్యాన్ , హకోబ్ కొజొయాన్ సంగ్రహాలయం
Արա Սարգսյանի և Հակոբ Կոջոյանի տուն-թանգարան
స్థాపితం1973
ప్రదేశం30 పుష్కిన్ వీధి, యెరెవాన్, ఆర్మేనియా
రకంవ్యక్తిగత సంగ్రహాలయం, ఆర్ట్ సంగ్రహాలయం

ఈ సంగ్రహాలయం అర్మేనియాలోని సాంస్కృతిక వారసత్వం స్మారక చిహ్నలలో ఒకటి.

చరిత్ర మార్చు

అరా సర్గయాన్, హకోబ్ కొజోయాన్ మ్యూజియాన్ని ఆర్మేనియా జాతీయ గేలరీకు ఒక శాఖగా 1973వ సంవత్సరంలో యెరెవాన్ లో స్థాపించారు. యు.ఎస్.ఎస్.ఆర్ యొక్క డిక్రీ కౌన్సిల్ మంత్రులు 1970 మే 25 న దీనికి పునాది వేశారు.[1]

ఈ మ్యూజియాన్ని 1934 లో నిర్మించేవరకు అర సర్గసియాన్, హకోబ్ కొజొయాన్ కలిసి ఇక్కడి నుండి నివసిస్తూ పనిచేశేవారు.

ఈ రెండు అంతస్తుల సంగ్రహాలయం యెరెవాన్ నగరమధ్యలో ఉంది. ఇక్కడే ఆర్మేనియాకు చెందిన ఇద్దరు గొప్ప ఫైన్ ఆర్ట్స్ గురువులు, శిల్పి అర సర్గస్యాన్ (1902-1969), చిత్రకారుడు హకోబ్ కొజొయాన్ (1883-1959) కొన్ని దశాబ్దాల పాటు నివసించారు. 1973 లో వారసులు ఆ ఇంటిని రాష్టృ ప్రభుత్వానికి అందజేయగా వారు దానిని అర్మేనియా జాతీయ గ్యాలరీ యొక్క శాఖగా అక్కడ ఒక మ్యూజియాన్ని నిర్మించారు.

కలెక్షన్స్ మార్చు

ఈ ఇంటి-సంగ్రహాలయంలోని సేకరణలో మ్యూజియానికి, ఆ కళాకారులకు చెందిన వస్తువులు ఉన్నవి.

అర సర్గస్యాన్ యొక్క కుటుంభం సేకరణలు, తాను విద్యార్థిగా ఉన్నప్పటి ఛిత్రాలు,, బహుమతిగా వచ్చిన వస్తువులు, అలాగే ఆ కళాకారుని రంగస్థల రూపకల్పనలు, గ్రాఫికల్ వర్కులను ఇక్కడ భద్రపరిచారు.[2]

హకోబ్ కొజొయాన్ యొక్క శిల్పాలను భవనంలోని రెండవ అంతస్తులో ప్రదర్శించారు. అక్కడ అతని హస్తకళలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. కొన్ని శిల్పాలను నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్మేనియా అందించిన నిధుల నుండి సమకూర్చారు, మిగతావి ఆ కళాకారుని వారసులు బహుమతిగా ఇచ్చారు.

గ్యాలరీ మార్చు

సూచనలు మార్చు

  1. Ara Sargsyan and Hakob Kojoyan Museum
  2. "Ara Sargsyan and Hakob Kojoyan Museum". Archived from the original on 22 డిసెంబరు 2017. Retrieved 30 జూన్ 2018.