ఆరోగ్యానికి పానీయాలు

నిత్యజీవతంలో చిన్న చిన్న పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటూ ఉంటాము . ప్రతి దానికి డాక్టరు వద్దకు పరుగెత్తుకెళ్ళడం సాధ్యం కాదు. అంత అవసరం కుడా ఉండదు. అలాంటి సమయాల్లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఆరోగ్యసమస్యల్ని తేలికగా అధిగమించవచ్చునని అద్యయనం చేసిన నిపునులు సూచిస్తున్నారు .

కొన్ని రకాల పానీయాలు

మార్చు
 
కొలంబియాలో పాపయుయేలా అనే ప్రత్యేక పండ్ల నుండి తయారైన సహజ ఆరోగ్య పానీయ చిత్రదృశ్యం
  • యవ్వనములో అనుభవించిన శృంగార జీవనము మళ్లి కావాలని అనుకునే వాళ్ళు ..... అందుకు అరటిపండుతో తయానుచేసే జ్యూస్ బ్రహ్మాండముగా పనిచేస్తుంది . ఒక కప్పు వెన్నతీసిన పాలు , మరోకప్పు యోగర్ట్ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసి బాగా మిశ్రమము చేయాలి . ఇలా తయారుచేసిన ద్రవము నుంచి వచ్చే సువాసన మహిళల్లో మంచి శృంగారా భావనలు పురికొల్పుతాయి. అరటిపళ్ళ నుంచి వెలువడే సౌవాసనల మూలం గా జననేంద్రియాలకు రక్తప్రసరణ అదికం అవుతుంది . తద్వారా బాగా ఉత్తేజము పొందుతుందని అధ్యయనము లో తేలింది .
  • నీరసముగా ఉండి అలసిపొయిన మీరు తిరిగి త్వరగా శక్తి పుంజుకోవడానికి, ఉత్సాహము కలగడానికి నిమ్మరసము బాగాపనిచేస్తుంది ...ఒక అరముక్క నిమ్మపండు రసము ఒక గ్లాసు నీటిలో (250 మి.లీ) తగినంత పంచదార , మధుమేహం గలవారు సుగరు ఫ్రీ పౌడర్ వేసి బాగా కలియబెట్టి త్రాగితే నీరసము , అలసట తగ్గుతుంది. నిమ్మ..... ముక్కు (నోస్) లో వుండే నరాలను ఉత్తేజపరిచి అలసటను పోగొడుతుంది . మెదడులోని సెన్సర్లు చైతన్యము పొంది శరీరము , మనసు హుసారు పొందుతాయి. నిమ్మ లో ఉండే విటమిన్‌ " సి " యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరము లో వ్యర్ధపదార్ధాలు తొలగి పోతాయి .
  • ఉదయాన్నే లెచిన వెంటనే బద్దకము గా అనిపిస్తుంది . ఒక పట్టాన నిద్రమత్తు వదలదు . కాసేపాగి లేదాం అనిపిస్తుంది . వీటిని నివారించాలంటే ఒక కప్పు కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు . రోజూ ప్రారంభములోనే నిద్ర మత్తు వదలించి ఉత్తేజము కలిగించే గుణము కాఫీలోని కెఫిన్‌ లో ఉంటుంది . శరీరమంతా ఉన్న నరాల వ్యవస్థ ఉత్తేజము పోంది హాయిగా చురుకుగా ఉండవచ్చును . అయితే వెన్నతీసిన పాలనే వాడాలి . తక్కువ చెక్కెర వేసుకోవాలి లేదా సుగరు ఫ్రీ పౌడర్ వాడాలి.
  • పొట్టలో వికారముగా లేదా బరువుగా , ఉబ్బరము గా ఉన్నప్పుడు మనసంతా చికాకుగా మారిపోతుంది . ఏ పనీ చేయాలనిపించదు . ఇలాంటి సమయాలలో అల్లం తో రసము తయారు చేసి తీసుకుంటే ఉపసయనము కలుగుతుంది . .... రోజూ మామూలుగా తాగే టీ లో రెండు అల్లము ముక్కలు వేసి తయారుచేసి త్రాగాలి లేదా గ్లాసు నీళ్ళలో చితకకొట్టిన అల్లము ముక్కలు వేసి బాగా కాచిన తర్వాత ఆ రసాన్ని కొద్దిగ పంచదార వేసి తీసుకోవచ్చు . ఇందులో మింట్ కలుపుకోవచ్చును . ఐతే చాతీలో మంటగా ఉంటే మాత్రము మింట్ ను వాడకూడదు . మింట్ ... మంటను అధికము చేస్తుంది .
  • వ్యాయామము చేసిన తరువాత చెమట రూపము ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతాయి . శక్తి అవసరము కావున . మధుమేహం లేకుంటే గ్లూకోస్ + నిమ్మ రసము కలిపి త్రాగాలి. తేనె +నిమ్మరసము అయితే మరీ మంచిది . మార్కెట్ లో " ORS డ్రింక్స్ రెడీ గా దొరుకుతాయి అవి త్రాగితే మంచిదే . వెన్న తీసిని పాలను పంచదార తగినంత కలిపి తీసుకోవచ్చు . వీటిలోని ప్రోటీన్లు , కాల్సియం , అనేక పోషకాలు శరీరానికి బాగా ఉపకరిస్తాయి.
  • రోజంతా వివిధ రకాల పనులతో ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి రావచ్చు . అలాంటి సమయములో యాపిల్ జ్యూస్ తీసుకోవాలి . యాపిల్ లో ఉండే ' యాస్ప్రిన్‌ " వల్ల తలబారము , తలనొప్పి తగ్గుతాయి. యాస్ప్రిన్‌ వలన గుండె జబ్బులు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది .
  • ప్రతి మహిళ రుతుస్రావము సమయము లో నొప్పి, నీరసము అనుభవిస్తుంటారు . ప్రతిరోజూ " ఇన్సులిన్‌ ఆకు " కషాయము తీసుకుంటే చాలా మంచిది . . . ఇన్‌సులిన్‌ మొక్క ఆకులు 4-5 దింటిని ముక్కలుగా చేసి ఒక గాసు (150 మి.లీ) నీటిలో బాగా మరిగించగా వచ్చిన నీటిని పాలు , పంచదార వేసి కాఫీ లా ప్రతిరోజూ తాగితే (మదుమేహం ఉంటే సుగర్ ఫ్రీ పౌడర్ వాడాలి ) రుతుస్రావ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి .
  • అప్పుడప్పుడు ఏదీ జ్ఞాపకము ఉండడం లేదని చెప్పే వయసు మల్లినవారు రోజూ " గ్రీన్‌ టీ " తాగితే బాగా ఉపయోగపడుతుంది . దీనిలోని అనేక యాంటి ఆక్షిడెంట్స్ ఆరొగ్యాన్ని కాపాడి మెదడును చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి .

నిద్ర రావడనికి మాత్రలు వాడేకంటే ... పడుకునే ముండు వెచ్చటి పాలు తీసుకుంటే ప్రయోజము ఉంటుంది . పాలు నిద్రకు ఉపయోగపడే " ట్రిప్టోఫాన్స్ " లను ఉత్తేజపరుస్తుంది .

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు