ఆర్ద్రత

గాలిలొ నీటి అవిరి యొక్క పరిమాణం

ఆర్ద్రత (Humidity - హ్యూమిడిటీ) అనగా గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. ఈ నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితిలో ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. ఆర్ద్రత అనేది అవపాతం, బిందు, లేదా పొగమంచు యొక్క సంభావ్యత సూచిస్తుంది. అధిక తేమ చర్మం నుండి తేమ యొక్క ఆవిరి రేటు తగ్గించడం ద్వారా శరీరం శీతలీకరణలో చెమట పట్టుట యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది.

తేమ అలుముకున్న ప్రాంతం

ఆర్ద్రత రెండు విధాలు: 1. పరమ ఆర్ద్రత 2. సాపేక్ష ఆర్ద్రత. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుత ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను కొలవడానికి ఆర్ద్రతామాపకం ఉపయోగిస్తారు. ఆర్ద్రతామాపకమును ఆంగ్లంలో హైగ్రోమీటర్ అంటారు. హైగ్రోమీటర్లు రెండు రకాలు: 1. హెయిర్ హైగ్రోమీటర్, 2. కెపాసిటివ్ హైగ్రోమీటర్

"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్ద్రత&oldid=2883904" నుండి వెలికితీశారు