రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన 2018 జులై 1 నుండి 2019 జూన్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహించాడు.[1]

ఆర్.పి.ఠాకూర్, ఐపీఎస్‌
జననం (1961-07-01) 1961 జూలై 1 (వయసు 63)
విద్యసివిల్ ఇంజినీరింగ్
విద్యాసంస్థఐఐటీ కాన్పూర్‌
పురస్కారాలుఇండియన్ పోలీసు మెడల్ (2003)
ఏఎస్ఎస్పీ మెడల్ (2004)
రాష్ట్రపతి మెడల్ (2011)

జననం, విద్యాభాస్యం

మార్చు

రామ్‌ప్రవేశ్ ఠాకూర్.1961 జూలై 01న బీహార్ రాష్ట్రం, పాట్నాలో జన్మించాడు. ఆయన ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

మార్చు

ఆర్.పి.ఠాకూర్ 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా భాద్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టి అనంతరం గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా, జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్(సీఐఎస్ఎఫ్) డీఐజీగా బాధ్యతలు నిర్వహించి అనంతరం పదోన్నతిపై హైదరాబాద్‌లోని డ్రగ్స్‌ అండ్‌ కాపీ రైట్స్‌ డీజీగా బాధ్యతలు చేపట్టాడు.

ఆర్.పి.ఠాకూర్ ఐజీగా పదోన్నతి పొంది ఏడీజీగా హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీగా, ఏడీజీగా కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా భాద్యతలు నిర్వహించి అనంతరం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, శాంతిభద్రతలు(లా అండ్‌ ఆర్డర్‌)ఏడీజీగా, అనంతపురం, చిత్తూరు డీఐజీగా, 2016 నవంబర్‌ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టి,[2] తరువాత 2018 జులై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితుడై[3] 2019 జూన్ 1 వరకు భాద్యతలు నిర్వహించాడు.

ఆర్.పి.ఠాకూర్ అనంతరం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా, తరువాత ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితుడయ్యాడు.[4][5]

పురస్కారాలు

మార్చు

ఆర్.పి.ఠాకూర్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004లో ఏఎస్ఎస్పీ మెడల్, 2011లో పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. The Times of India. "RP Thakur appointed as new DGP of Andhra Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  2. Sakshi (19 November 2016). "ఏసీబీ డీజీగా ఠాకూర్ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  3. Sakshi (1 July 2018). "కొత్త పోలీస్‌ బాస్‌ ఠాకూర్‌". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  4. Vaartha (13 January 2021). "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  5. Zee News Telugu (13 January 2021). "ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.. ఉత్తర్వులు జారీ". Archived from the original on 2021-01-14. Retrieved 21 February 2022.