ఆర్‌. ప్రియా రాజన్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022 మార్చి 4న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) 49వ మేయర్‌గా ఎన్నికైంది.[1][2]

ఆర్. ప్రియా రాజన్‌

మేయర్
పదవీ కాలం
2022 మార్చి 4 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1994
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ డీఎంకే
తల్లిదండ్రులు పెరంబూర్‌ రాజన్‌
జీవిత భాగస్వామి కె.రాజా
వృత్తి రాజకీయ నాయకురాలు

కుటుంబ నేపథ్యం మార్చు

ఆర్. ప్రియ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె పెరంబూర్‌ మాజీ ఎమ్మెల్యే చెంగై శివమ్‌ మనవరాలు. అయన పెరంబూర్‌ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ప్రియ తండ్రి పెరంబూర్‌ రాజన్‌ 30 ఏళ్లకు పైగా డీఎంకే పార్టీలో సభ్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పార్టీ పెరంబూర్‌ ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఆమె భర్త కె.రాజా ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది.

రాజకీయ జీవితం మార్చు

ప్రియా 18 ఏళ్ల వయసులో డి.ఎం.కె కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల్లో 74వ వార్డు తిరువికనగర్‌ డివిజన్ నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. చెన్నై మేయర్‌ పదవిని 2022 ఎన్నికలలో దళిత మహిళకు రిజర్వ్‌ చేయడంతో నార్త్‌ చెన్నై 74వ వార్డు తిరువికనగర్‌ డివిజన్ నుండి గెలిచిన ఆర్‌.ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికై 2022 మార్చి 4న మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కు తొలిసారి ఎన్నికైన దళిత మహిళ మేయర్‌గా, చెన్నై కార్పొరేషన్‌ మహిళ మేయర్‌గా రికార్డు సృష్టించింది.

మూలాలు మార్చు

  1. Sakshi (4 March 2022). "చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్‌". Retrieved 5 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Namasthe Telangana (4 March 2022). "చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్.ప్రియ&oldid=3672182" నుండి వెలికితీశారు