ఆర్.లింబాద్రి
ఆర్.లింబాద్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన 2023 జూన్ 27న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేసింది.[1]
ఆర్.లింబాద్రి | |||
చైర్మన్
తెలంగాణ ఉన్నత విద్యామండలి | |||
పదవీ కాలం 2023 జూన్ 27 – 16 అక్టోబర్ 2024 | |||
కార్యనిర్వాహక చైర్మన్
| |||
పదవీ కాలం 25 ఆగస్టు 2021 – 2023 జూన్ 27 | |||
వైస్ చైర్మన్
తెలంగాణ ఉన్నత విద్యామండలి | |||
పదవీ కాలం 07 ఆగస్టు 2017 – 2021 ఆగష్టు 22 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1965 రావుట్ల, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
నివాసం | హైదరాబాద్ | ||
పూర్వ విద్యార్థి | ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుఆర్.లింబాద్రి తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, రావుట్ల గ్రామంలో జన్మించాడు. ఆయన విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో, ఆర్మూర్ డివిజన్‌లో రైతు కూలీ సంఘంలో పనిచేశాడు. లింబాద్రి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, పీహెచ్డీ పట్టా అందుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చులింబ్రాది ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, బీవోఎస్ డైరెక్టర్‌గా, అకాడమిక్ ఆడిట్‌సెల్ జాయింట్ డైరెక్టర్‌గా, 4 ఏప్రిల్ 2013 నుండి 4 జులై 2014, మళ్ళీ 27 నవంబర్ 2014 నుండి 28 జులై 2016 వరకు రెండు పర్యాయాలు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, తెలంగాణ వర్సిటీలో 2015 మార్చి నుంచి 2017 సెప్టెంబర్ వరకు సోషల్ సైన్సెస్ డీన్ గా, ఓయూ శతాబ్ది ఉత్సవాల సమయంలో 6 డిసెంబర్ 2016 నుండి 6 ఆగష్టు 2017 వరకు ఓయూ వీసీ ఓఎస్డీగా పని చేశాడు.
లింబ్రాది రాష్ట్ర ఉన్నత విద్యామండలికి 7 ఆగష్టు 2017 నుంచి 22 ఆగష్టు 21 వరకు వైస్ ఛైర్మన్‌గా, 25 ఆగస్టు 2021 – 2023 జూన్ 27 వరకు కార్యనిర్వాహక ఛైర్మన్‌గా పని చేయగా [2], 2023 జూన్ 27న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేసింది.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (27 June 2023). "ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ The New Indian Express (25 August 2021). "Professor R Limbadri named Telangana State Council of Higher Education chairman". Archived from the original on 28 June 2023. Retrieved 28 June 2023.
- ↑ Eenadu (29 June 2023). "ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.
- ↑ Andhra Jyothy (27 June 2023). "ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.
- ↑ A. B. P. Desam (26 June 2023). "ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా లింబాద్రి, వైస్ చైర్మన్‌గా మహమూద్ నియామకం!". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.