ఆర్. ఇంద్ర కుమారి

ఆర్. ఇంద్ర కుమారి (1950/1951 - 15 ఏప్రిల్ 2024) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాట్రంపల్లి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఎన్నికై జయలలిత మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసింది.[1]

ఆర్. ఇంద్ర కుమారి

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1991-96
నియోజకవర్గం నాట్రంపల్లి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1991-96

వ్యక్తిగత వివరాలు

జననం 1951
తమిళనాడు, భారతదేశం
మరణం 15 ఏప్రిల్ 2024
చెన్నై
రాజకీయ పార్టీ అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
ఇతర రాజకీయ పార్టీలు ద్రవిడ మున్నేట్ర కజగం
నివాసం గాంధీ నగర్, చెన్నై, తమిళనాడు

ఆమె డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలిగా పని చేసింది.

జైలు శిక్ష

మార్చు

ఆర్. ఇందిరా కుమారి మంత్రిగా పని చేసిన సమయంలో ప్రభుత్వ శాఖ నుండి ₹15.45 లక్షలను దారిమళించి వైకల్యాలున్న పిల్లల కోసం పాఠశాలలను నడుపుతున్నారనే సాకుతో ఆ మొత్తాన్ని తన భర్త ఎ. బాబు నడుపుతున్న రెండు ట్రస్టులలో పార్క్ చేసినందుకు 2021లో ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.[2][3]

ఇంద్ర కుమారి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 ఏప్రిల్ 15న మరణించింది.[4][5]

మూలాలు

మార్చు
  1. EENADU (17 April 2024). "మాజీ మంత్రి ఇంద్రకుమారి మృతి". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. The New Indian Express (29 September 2021). "Former TN minister Indira Kumari gets five-year jail term for misappropriation of funds" (in ఇంగ్లీష్). Archived from the original on 29 April 2024. Retrieved 29 April 2024.
  3. NT News (29 September 2021). "మాజీ మంత్రి ఇందిరా కుమారి, ఆమె భ‌ర్త‌కు అయిదేళ్ల జైలుశిక్ష‌". Archived from the original on 29 April 2024. Retrieved 29 April 2024.
  4. The Times of India (16 April 2024). "Ailing former AIADMK minister Indira Kumari dies in city hospital". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  5. The Hindu (15 April 2024). "Former Minister Indira Kumari is no more" (in Indian English). Archived from the original on 29 April 2024. Retrieved 29 April 2024.