ఆశారెడ్డి
అమెరికాలో మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆశారెడ్డి. ఈమె క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయారు. ఈమె తండ్రి హైదరాబాదులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసిన వింగ్ కమాండర్ ఎస్.వి.ప్రసాద్, తల్లి ఇందిర. ఆశ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుండి ఎల్.ఎల్.బి. పట్టాని పొందారు. ఆశకు 1983లో రామకృష్ణారెడ్డితో పెళ్లయింది. ఆ తరువాత రామకృష్ణారెడ్డికి అమెరికాలో ఉద్యోగం రావడంతో భర్తతోపాటు హ్యూస్టన్ వెళ్లారు. గృహిణిగానే, అమెరికాలో లా డిగ్రీ పూర్తి చేసి, రెండు వందల మంది విద్యార్థుల్లో రెండవ స్థానంలో నిలిచారు, అంతేకాక న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి టాపర్‌గా నిలిచారు. తరువాత కొంతకాలం ఆర్ధర్ అండర్సన్ అనే కంపెనీలో ఉద్యోగం చేశారు. న్యాయవాది వృత్తిపై ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగం మానేసి స్వంతంగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టి అతి కొద్దికాలంలోనే క్రిమినల్ డిఫెన్స్ లాలో మంచి లాయర్‌గా పేరు సంపాదించారు. తరువాత ఎన్నో లా సంస్థలకు, ఇతర సంస్థలకు వివిధ స్థాయిల్లో పనిచేశారు. అంతేకాక వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఈమెను గుర్తించి అక్కడివారు మునిసిపల్ జడ్జిగా ఎన్నుకున్నారు.
సత్కారాలు
మార్చుహెచ్-టెక్సాస్ పత్రిక ఈమెకు నాలుగు సంవత్సరాలు హ్యూస్టన్‌లో ఉన్నతమైన లాయర్‌గా రేటింగ్ ఇచ్చింది. ఈమె ప్రతిష్ఠాత్మకమైన ఇండో-అమెరికన్ చారిటీ ఫౌండేషన్ బోర్డ్‌లో 2012-2013 వరకు సభ్యురాలిగా ఉన్నారు. 2003 సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో ప్రతిభ సాధించినందుకుగాను ‘తానా’ వారు ఆమెను ఉన్నత పురస్కారంతో సత్కరించారు.
అవార్డు పేరు | మంజూరు చేసిన సంస్థ | సంవత్సరం |
---|---|---|
టాప్ క్రిమినల్ లాయర్ | హెచ్-టెక్సాస్ పత్రిక | 2011 |
హ్యూస్టన్ యొక్క టాప్ క్రిమినల్ న్యాయవాది | హెచ్-టెక్సాస్ పత్రిక | 2010 |
హ్యూస్టన్ యొక్క టాప్ క్రిమినల్ న్యాయవాది | హెచ్-టెక్సాస్ పత్రిక | 2009 |
లా రంగంలో విశిష్ట ప్రతిభ | తానా, శాన్ జోస్, కాలిఫోర్నియా | 2003 |
గుర్తింపు అవార్డ్ (Award of Recognition) | TCA హ్యూస్టన్ | 2003 |
మూలాలు
మార్చుసాక్షి దినపత్రిక - 18-06-2014