1972 ప్రింటర్ మాన్యువల్ నుండి ఆశ్కి (ASCII) పట్టిక

ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్‌కు డేటా ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలుగా ఉండేందుకు ఒక్కొక్క అక్షరానికి ఇవ్వవలసిన కోడ్‌ను స్థిరీకరించారు. ఇలాంటి స్థిరీకరణ చేసిన వాటిలో ఆశ్కి (ASCII - American Standard Code for Information Interchange) కోడ్ విరివిగా వాడబడుచున్నది. ASCII Code ప్రకారం ఒక్కొక్క అక్షరానికి 7 బిట్స్ కోడ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎక్కువ అక్షరాలుంటె వివిధ భాషలతో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటం కోసం ASCII Codeలో ఒక్కొక్క అక్షరానికి 8 బిట్స్ కోడ్ ను కూడా పొందుపరిచారు. ASCII-7 బిట్‌కోడ్ ఉపయోగించి "128" కారెక్టర్స్ వరకు కోడ్ ఇవ్వవచ్చు. అలాగే ASCII-8 బిట్ కోడ్ ఉపయోగించి "256" కారెక్టర్స్ వరకు కోడ్ ఇవ్వవచ్చు.


మూలాలుసవరించు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ్కి&oldid=2222115" నుండి వెలికితీశారు