ఆహార్యాభినయం

చతుర్విధ అభినయములు లలో మూడవది. నాటకంలో కావ్యార్థాన్ని వ్యక్తీకరించడంలో ఆహార్యాభినయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రంగస్థలం మీద నటీనటుల ధరించే పాత్రలను సామాజికులు గుర్తుపట్టేట్లు చేపే ప్రక్రియే ఆహార్యం. ఆహార్యంతో కూడిన నటనే ఆహార్యాభినయం. తెర తీయగానే ప్రేక్షకులకు మొదట కనిపించేది రంగస్థలం మీద పాత్రల రూపాలే. రంగస్థలం మీద నిల్చున్న వ్యక్తి రాముడా, నారదుడా, జమీందారా, కార్మికుడా, పౌరోహితుడా, డాక్టరా, కర్షకుడా అన్న విషయం అతని వేషాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి తెలుస్తుంది. అభినయానికి ఆహార్యం నిండుదనాన్ని ఇస్తుంది.

ఒక నాటకంలో దుర్యోధనుడు,కృష్ణుడు, అర్జునుడు పాత్రలలో నటిస్తున్న కళాకారుల అభినయం

60 ఏళ్ల వృద్దుడి పాత్రను 16 ఏళ్ల కుర్రాడు ధరించే సందర్భాలుంటాయి. అలాంటప్పుడు ఆహార్యం తోడ్పాటులేకుండా ఆ పాత్ర నిర్వహణ చేయడం కష్టం. సరైన ఆహార్యం లేకపోతే ఆ పాత్రధారి నటన ప్రేక్షలకుల కంటికి ఆనదు.

మూలాలుసవరించు