ఆహార సంస్కరణ అనగా ఆహార ముడి పదార్ధములను సేకరించి వాటిని వాటినుండి వివిధ వుత్పత్తులను తయారుచేయటం . ఇక్కడ ముడి పదార్థములనగా పండిన పంట, పచ్చి మాంసము మున్నగునవి.

ఛీజ్ వుత్పత్తి

చరిత్ర

మార్చు

పూర్వ కాలం నుండి అహారాన్ని భద్రపరుచుటకు రకరకాల పద్ధతులను వాడుతున్నారు. ఉప్పుతో భద్రపరుచుట, రోస్టింగ్, స్టీమింగ్, ఓవెర్ బేకింగ్, స్మోకింగ్ మొదలగునవి.

లాభాలు

మార్చు

ఆహార సంస్కరణ వలన పలు లాభాలున్నాయి.[1] చెడు పదార్ధములను తీసివేయుట, మార్కెటింగ్, దూరుపు ప్రదేశాలకు పంపించుట సులువు అగును. ప్రస్తుత కాలములో భార్యభర్తలు ఇద్దరు పనిచేయడం మూలంగా వంట వండుకొని తినుటకు సమయము ఉండకపోవచ్చును. వీటి ద్వారా చాలా సమయము ఆదా అగును.

నష్టాలు

మార్చు

ఇలా తయారు చేయబడిన పదార్ధములలో నిల్వవున్న చెడిపోకుండా వుండుటకు రసాయానాలు కలుపుతారు.ఇవి ఆరోగ్యమునకు మంచివి కాకపోవచ్చు.

నేటి ఆహార సంస్కరణ ప్రామాణికాలు

మార్చు

ఖర్చు : ఉత్పత్తిదారుడికి ఎక్కువ మొత్తంలో తయారు చేయడం వలన ఖర్చు తగ్గును. వినియోగదారుడుకి కూడా ఖర్చు తగ్గును.

ఆరోగ్యము :

ఈ పద్ధతిలో కొవ్వుని తగ్గిస్తారు.

శుభ్రత :

మంచి ప్రామాణికాలను వాడుతారు.

వివిధ పరిశ్రమలు

మార్చు
  • కేనింగ్
  • మత్స్య పరిశ్రమ
  • మాంస పరిశ్రమ
  • షుగర్ పరిశ్రమ

విద్య

మార్చు

కేంద్ర ఆహర సాంకేతిక పరిశోధన సంస్థ [2] ఆధ్వర్యంలో వివిధ స్వల్పకాలిక కోర్సులు, దీర్ఘ కాలిక కోర్సులు నిర్వహించబడుతున్నాయి.

వనరులు

మార్చు
  1. "In Praise of Fast Food". Archived from the original on 2010-11-25. Retrieved 2010-12-18.
  2. "కేంద్ర ఆహర సాంకేతిక పరిశోధన సంస్థ". Archived from the original on 2011-07-08. Retrieved 2011-07-09.