ఇంక్‌స్కేప్

ఇంక్‌స్కేప్ (లేదా ఇఙ్క్‌స్కేప్) ఎస్వీజీ బొమ్మలు తయారు చేసుకునేందుకు, వాటిని సరిదిద్దేందుకు ఉపయోగపడే స్వేచ్ఛా, బహిరంగాకర ఉపకరణం. ఈ ఉపకరణమును వాడి చేసిన బొమ్మలు పరిమాణానికి సంబంధం లేకుండా పెద్దగా చేసినా చిన్నగా చేసినా ఒకేలా, మసక అవకుండా కనిపిస్తాయి. ఇంక్‌స్కేప్ యూనిక్స్ వంటి నిర్వాహక వ్యవస్థల లోనూ, మైక్రోసాఫ్ట్ విండోస్ లోనూ, మాక్ ఓఎస్ Xలోనూ నడుస్తుంది.

ఇంక్‌స్కేప్
Inkscape Logo.svg
Inkscape 1.1 screenshot.png
ఇంక్‌స్కేప్ 0.91
అభివృద్ధిచేసినవారు ఇంక్‌స్కేప్ జట్టు
సరికొత్త విడుదల 0.91[1] / 2015 జనవరి 28 (2015-01-28)
ప్రోగ్రామింగ్ భాష C++ (using gtkmm)
నిర్వహణ వ్యవస్థ మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ OS X , యునిక్స్-వంటి
వేదిక GTK+
భాషల లభ్యత 40 భాషలు
రకము సదిశా రేఖాచిత్రాల కూర్పకం
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ Inkscape.org

ఎగుమతి/దిగుమతిసవరించు

ఇంక్‍స్కేప్ ఈ కింద తెలిపిన విధములలో బొమ్మలను దిగుమతి చేసుకోగలదు :

 • ఎస్వీజీ
 • ఎస్వీజీ (జెడ్)
 • పీడీఎఫ్
 • ఏఐ
 • దాదాపు రేస్టర్ శైలి బొమ్మలన్నీ (జేపీజీ, పీఎన్జీ, గిఫ్ మొ॥)

కొన్ని పొడిగింతలు వాడి ఇంక్‍స్కేప్ ఈ కింది బొమ్మ శైలిలను దిగుమతి చేసుకోగలదు :

 • పీఎస్ (ఘోష్ట్‍స్క్రిప్ట్ వాడి)
 • ఈపీఎస్
 • డయా
 • ఎక్స్‍ఫిగ్
 • స్కెచ్
 • కోరెల్‍డ్రా (యూనికన్వర్టర్ వాడి)
 • సీజీఎం
 • ఎస్కేవన్

ఇంక్‍స్కేప్ ఈ శైలులలో బొమ్మలను ఎగుమతి చేయగలదు:

 • ఎస్వీజీ
 • ఎస్వీజీ (జెడ్)
 • పీడీఎఫ్
 • పీఎస్
 • ఈపీఎస్
 • ఈపీఎస్‍ఐ
 • ఏఐ
 • టెక్ (లేటెక్)
 • పీఓవీ
 • హెచ్‍పీజీఎల్

బయటి లంకెలుసవరించు

 1. http://wiki.inkscape.org/wiki/index.php/Release_notes/0.91