ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు, ఇండోర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్ ( IIM-I అని కూడా పిలుస్తారు) అన్నది ఒక ప్రభుత్వ స్వయంపాలక మేనేజ్‌మెంట్ కళాశాల. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణంలో ఉంది. ప్రఖ్యాత గాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కుటుంబంలోని ఆరోవది,[1] మరి 1996 లో స్దాపించడమైనది. ఇది భారతదేశంలోని అసోసియెషన్ ఆఫ్ ఎం.బీ.ఏ  (AMBA)[2] గుర్తింపు కలిగిన అతికొద్ది విద్యాసంస్ధలలో ఒకటి. మానవ వనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన NIRF 2017 ర్యాంకుల ప్రకారం ఐ.ఐ.ఎం ఇండోర్ మొదటి పది స్ఢానాలలోనే[3] ఉంది, మరి Business Today పత్రిక వారి 2016 ర్యాంకులలోనూ అదే స్థాయిలో[4] నిలబడింది

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు, ఇండోర్
నినాదం"సిద్ధి మూలం ప్రభంధనం"
ఆంగ్లంలో నినాదం
నిర్వహణకు మూలం సాధన
రకంపబ్లిక్ బిజినెస్ స్కూల్
స్థాపితం1996
డైరక్టరుప్రొ. రిషీకేష టి. క్రిష్ణన్
స్థానంఇండోర్
కాంపస్సబర్బన్, 193 ఎకరం (0.8 కి.మీ2)
అనుబంధాలుఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు

విద్యా కార్యక్రమాలు

మార్చు
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (PGP) - రెండు ఏళ్ళ వ్యవధి కలది. MBAతో సరిసమానం[5]
  • ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (IPM) - ఐదు ఏళ్ళ వ్యవధి కలది[6]
  • ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (EPGP) - ఒక ఏళ్ళ వ్యవధి కలది[7]
  • ఫెల్లో (డాక్టరల్) ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (FPM)[8]
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (PGPMX)- రెండు ఏళ్ళ వ్యవధి కలది, వారాంతాలలో మాత్రమే ఉంటుంది[9]
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ముంబయి (PGP-Mumbai)[10]
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (PGP-HRM)[11]

క్యాంపస్  ప్రాంగణం

మార్చు
 
ఐ.ఐ.ఎం ఇండోర్ లోని స్విమ్మింగ్ పూల్

క్యాంపస్ ప్రాంగణం ఇండోర్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో, రావు అనే గ్రామానికి సమీపంలో ఉంది. క్యాంపస్ లో విద్యార్ధుల వసతి కోసం 18 హాస్టల్స్[12] ఉన్నాయి, అధ్యాపకులు కూడా వారి కుటుంబాలతో కలిసి క్యాంపస్ లోనే ఉంటారు. విద్యార్ధుల కోసం లైబ్రరీ, జిం, ఈత కొలను, మైదానాలు ఉన్నాయి. లైబ్రరీ లో సుమారు 15000 పైగా పుస్తకాలు ఉన్నాయి, సంవత్సరంలో మూడు రోజుల మినహా అన్నీ రోజులూ పని చేస్తుంది. [13]

 
ఐ.ఐ.ఎం ఇండొర్ - ముఖ్య భవనం

సూచనలు

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.iimidr.ac.in/about-us/iim-indore-at-a-glance/
  2. http://www.iimidr.ac.in/news-events/iim-indore-gets-amba-accreditation/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-06. Retrieved 2017-11-23.
  4. http://www.businesstoday.in/magazine/features/india-best-b-schools-2016-full-list/story/240287.html
  5. http://www.iimidr.ac.in/academic-programmes/post-graduate-program-in-management/
  6. http://www.iimidr.ac.in/academic-programmes/five-year-integrated-programme-in-management-ipm/
  7. http://www.iimidr.ac.in/executive-programmes/executive-post-graduate-programme-in-management-epgp-2/
  8. http://www.iimidr.ac.in/academic-programmes/fellow-programme-in-management-fpm/
  9. http://www.iimidr.ac.in/executive-programmes/post-graduate-programme-in-management-for-executives-pgpmx/
  10. http://www.iimidr.ac.in/academic-programmes/post-graduate-programme-at-mumbai-pgp/
  11. http://www.iimidr.ac.in/academic-programmes/post-graduate-programme-in-human-resource-management-pgp-hrm/
  12. http://www.iimidr.ac.in/students-corner/life-at-iim-indore/
  13. http://www.iimidr.ac.in/facilities/library/