ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ

సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన భారత జాతీయ అకాడమీ

భారత జాతీయ సైన్సు అకాడమీ (ఆంగ్లం: Indian National Science Academy) అనేది సైన్స్, టెక్నాలజీరంగాలకు చెందిన అన్ని శాఖలలోని భారతీయ శాస్త్రవేత్తల కోసం న్యూఢిల్లీలో ఏర్పాటయిన ఒక జాతీయ అకాడమీ.[1]

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
(INSA)
Established7 జనవరి 1935; 89 సంవత్సరాల క్రితం (1935-01-07)
వ్యవస్థాపకులులూయిస్ లీ ఫెర్మోర్
కార్యస్థానం
భౌగోళికాంశాలు28°37′43.8″N 77°14′26.7″E / 28.628833°N 77.240750°E / 28.628833; 77.240750
అధ్యక్షుడుఅశుతోష్ శర్మ

2015లో ఐఎన్ఎస్ఎ దేశంలోని యువ శాస్త్రవేత్తల కోసం ఇతర జాతీయ యువ అకాడమీలకు అనుగుణంగా ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (INYAS) పేరుతో ఒక జూనియర్ వింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలోని యువ శాస్త్రవేత్తల జాతీయ యువ అకాడమీ, కాగా గ్లోబల్ యంగ్ అకాడమీకి అనుబంధంగా పనిచేస్తుంది. 2019 నవంబరు 20న వరల్డ్ సైన్స్ ఫోరమ్, బుడాపెస్ట్‌లో ఆమోదించబడిన యంగ్ అకాడమీల డిక్లరేషన్‌పై కూడా ఇది సంతకం చేసింది.[2] దీనికి ప్రస్తుత అధ్యక్షుడు ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కాగా పదవీకాలం 2023 నుంచి 2025 వరకు ఉంటుంది.

అవలోకనం

మార్చు

అకాడమీలో ఫౌండేషన్ సభ్యులు, విదేశీ సభ్యులు ఉంటారు. నామినేషన్ ద్వారా మాత్రమే అకాడమీకి ఎన్నిక జరుగుతుంది.[3] అకాడమీ లక్ష్యాలు భారతదేశంలో సైన్స్‌ని ప్రోత్సహించడం, జాతీయ సంక్షేమానికి దాని అప్లికేషన్, శాస్త్రవేత్తల ప్రయోజనాలను కాపాడడం, సహకారాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలను ఏర్పరచడంతో పాటు జాతీయ సమస్యలపై అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం.

శాస్త్రీయ పరిశోధనలో శ్రేష్ఠతను ప్రోత్సహించడంలో దీని పాత్ర ఎనలేనిది. 'సైన్స్ అండ్ టెక్నాలజీ' రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించే ఉద్దేశంతో, అకాడమీ 59 అవార్డులను ఏర్పాటు చేసింది, వీటిని 4 విభాగాలలో ఇస్తానరు, అవి అంతర్జాతీయ అవార్డులు, జనరల్ మెడల్ అండ్ లెక్చర్ అవార్డులు, సబ్జెక్ట్‌వైజ్ మెడల్స్/లెక్చర్లు, యువ శాస్త్రవేత్తలకు అవార్డులు.

ఐఎన్ఎస్ఎ పత్రికలను ప్రచురిస్తుంది, శాస్త్రీయ చర్చలను నిర్వహిస్తుంది. ఇది 2004లో సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్‌లో నాలెడ్జ్‌కు ఓపెన్ యాక్సెస్‌పై బెర్లిన్ డిక్లరేషన్‌పై సంతకం చేసింది.

అధ్యక్షులు[4]

మార్చు
క్రమ సంఖ్య అధ్యక్షుడు పదవీ కాలం
1 లూయిస్ లీ ఫెర్మోర్ 1935 1936
2 మేఘనాద్ సాహా 1937 1938
3 రామ్ నాథ్ చోప్రా 1939 1940
4 బైని ప్రసాద్ 1941 1942
5 జ్ఞాన చంద్ర ఘోష్ 1943 1944
6 దరాషా నోషెర్వాన్ వాడియా 1945 1946
7 శాంతి స్వరూప్ భట్నాగర్ 1947 1948
8 సత్యేంద్ర నాథ్ బోస్ 1949 1950
9 సుందర్ లాల్ హోరా 1951 1952
10 కరియమాణికం శ్రీనివాస కృష్ణన్ 1953 1954
11 అమూల్య చంద్ర ఉకిల్ 1955 1956
12 ప్రశాంత చంద్ర మహాలనోబిస్ 1957 1958
13 సిసిర్ కుమార్ మిత్ర 1959 1960
14 అజుధియా నాథ్ ఖోస్లా 1961 1962
15 హోమీ జహంగీర్ భాభా 1963 1964
16 వసంత్ రామ్‌జీ ఖనోల్కర్ 1965 1966
17 తిరువేంగడం రాజేంద్రం శేషాద్రి 1967 1968
18 ఆత్మ రామ్ 1969 1970
19 బాగేపల్లి రామచంద్రాచార్ శేషాచార్ 1971 1972
20 దౌలత్ సింగ్ కొఠారీ 1973 1974
21 బెంజమిన్ పియరీ పాల్ 1975 1976
22 రాజా రామన్న 1977 1978
23 వులిమిరి రామలింగస్వామి 1979 1980
24 మంబిల్లికలత్తిల్ గోవింద్ కుమార్ మీనన్ 1981 1982
25 అరుణ్ కుమార్ శర్మ 1983 1984
26 చింతామణి నాగేశ రామచంద్రరావు 1985 1986
27 ఔటర్ సింగ్ పెంటల్ 1987 1988
28 మన్ మోహన్ శర్మ 1989 1990
29 ప్రకాష్ నారాయణ్ టాండన్ 1991 1992
30 శ్రీ కృష్ణ జోషి 1993 1995
31 శ్రీనివాసన్ వరదరాజన్ 1996 1998
32 గోవర్ధన్ మెహతా 1999 2001
33 మార్తాండ వర్మ శంకరన్ వలియాథన్ 2002 2004
34 రఘునాథ్ అనంత్ మషేల్కర్ 2005 2007
35 మామన్నమన విజయన్ 2008 2010
36 క్రిషన్ లాల్ 2011 2013
37 రాఘవేంద్ర గడగ్కర్ 2014 2016
38 అజయ్ కె. సూద్ 2017 2019
39 చంద్రిమా షాహా 2020 2022
40 అశుతోష్ శర్మ 2023 2025

మూలాలు

మార్చు
  1. "Indian National Science Academy, New Delhi". Department of Science and Technology, India. 2016. Retrieved 17 October 2016.
  2. "Launch of the Declaration on the Core Values of Young Academies". World Science Forum. World Science Forum. Archived from the original on 21 April 2021. Retrieved 24 February 2020.
  3. "About INSA". Indian National Science Academy. 2016. Archived from the original on 6 June 2017. Retrieved 17 October 2016.
  4. "Past Presidents". Indian National Science Academy. 2016. Archived from the original on 12 October 2016. Retrieved 17 October 2016.