ఇండియాస్ డాటర్ లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఒక డాక్యుమెంటరీ చిత్రం. ఇది బీబీసీ వారి స్టోరీవిల్ ధారావాహికలో భాగంగా ప్రసారమయింది.[3] ఇది 2012లో ఢిల్లీలో జరిగిన జ్యోతి సింగ్ అనే 23 యేళ్ళ ఫిజియోథెరపీ విద్యార్థి సామూహికమానభంగం, హత్య ఆధారంగా రూపొందించబడింది. మార్చి 8, 2015 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఎండీటీవీ, యూకేలో బీబీసీ4 ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలనుకున్నారు.

India's Daughter
దర్శకత్వంLeslee Udwin
రచనLeslee Udwin
నిర్మాతLeslee Udwin
కూర్పుAnuradha Singh
సంగీతంKrsna Solo
నిర్మాణ
సంస్థలు
  • Assassin Films
  • Tathagat Films[2]
పంపిణీదార్లుBerta Film
విడుదల తేదీ
4 March 2015[1]
సినిమా నిడివి
58 minutes (58 min 18 sec)
దేశంUnited Kingdom
భాషలుEnglish, Hindi
Students protesting at Raisina Hill, Rajpath, December 2012

మార్చి 1న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి ఇంటర్వ్యూ ఉందన్న విషయం తెలిసింది. వెంటనే ఈ విషయం భారతీయ మీడియాకు తెలిసి, దీనిపై ధుమారం రేగింది. భారత ప్రభుత్వం ఈ చిత్ర ప్రసారాన్ని కోర్టు నిర్దేశం ద్వారా 4 మార్చి న నిలిపివేసింది. బీబీసీ ఆ విధంగానే ప్రసారం చేయబోమని ప్రకటించింది. కానీ యూకేలో 4 మార్చి న ఈ చిత్రం ప్రసారం చేసారు. యూట్యూబ్ లో కూడా ఈ చిత్రం ఎక్కించబడీంది. సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం పొంది యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది.5 మార్చి న భారత ప్రభుత్వం యూట్యూబ్ ను ఈ వీడియోను భారతదేశంలో బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. యూట్యూబ్ ఆ ఆదేశాన్ని పాటిస్తూ వీడియోను తీసివేసింది.

మూలాలు

మార్చు
  1. Bhatt, Abhinav (5 March 2015). "After India's Ban, Nirbhaya Documentary 'India's Daughter' Aired by BBC". NDTV. Retrieved 5 March 2015.
  2. "India's Daughter". CBC. 7 March 2015. Retrieved 7 March 2015.
  3. ఢిల్లీ ఉదంతం ఇంటర్వ్యూ చేసి నన్ను నేను కోలుకోలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళాను

ఇతర లింకులు

మార్చు