ఇండియా టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే ఆంగ్ల వార పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్). ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రచురితమైంది. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇండియా టుడే
30th Anniversary issue of India Today
Editor-in-chiefAroon Purie
వర్గాలుNews, Science, Sport, History
తరచుదనంWeekly
ముద్రించిన కాపీలు1,100,000
ముద్రణకర్తAroon Purie
మొదటి సంచిక1975
సంస్థIndia Today group
దేశంభారత దేశము
కేంద్రస్థానంConnaught Place, New Delhi[1]
భాషEnglish

ఇది ఇండియా టుడే గ్రూప్ లో భాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్థాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 వార్తాపత్రిక, ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి ఉంది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి ఉంది.

ఇంగ్లీష్ లోనే కాక హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంభించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి. 2015 ఫిభ్రవరిలో దక్షిణ భారతభాషల ప్రచురణలు మూతపడ్డాయి.[2]

మూలాలు

మార్చు
  1. "India Today to close print editions of magazine in three south Indian languages". India Today Group. Retrieved 2010-09-28.
  2. "India Today to close print editions of magazine in three south Indian languages". The Newsminute. 2015-02-09. Retrieved 2022-01-15.