ఇందిర రామమూర్తి
ఇందిర రామమూర్తి ప్రముఖ అబ్సెస్ట్రిసియన్, గైనకాలజిస్టు.[1]
జీవిత విశేషాలు
మార్చుఆమె ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి, తమిళనాడు రాష్ట్రానికి వైద్యమంత్రిగా పనిచేసిన ఆచంట రుక్మిణమ్మ ల ఏకైక కుమార్తె.[2] ఆమె 1920 లోజన్మించారు. ఆమె ప్రసిద్ధ న్యూరో సర్జన్ అయిన బాలసుబ్రహ్మణ్యన్ రామమూర్తిను వివాహం చేసుకున్నారు. ఆయన "న్యూరోసర్జన్ పితామహుడు"గా ప్రసిద్ధుడు.[2]
ఆమె రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ , హైనకాలజిస్టులో ఫెలోగా యున్నారు. ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియాలో సభ్యులు.[2] ఆమె మద్రాసు మెడికల్ కాలేజి లోనూ , ప్రభుత్వ మెటర్నిటీ హాస్పటల్ లో హైనకాలజీవిభాగంలో గౌరవ ఫొఫెసర్ గా కూడా పనిచేసారు. ఆమె "ఆబ్‌స్టెట్రిక్స్ , గైనకాలజీ" విభాగానికి అధిపతిగా కూడా పనిచేసారు.
ఆమెకు ఇద్దరు కుమారులు. వారు ప్రముఖ జర్నలిస్టు ఆర్.విజయరాఘవన్, న్యూరోసర్జన్ రవి రామమూర్తి [3]
మూలాలు
మార్చు- ↑ Dr. Indira Ramamurthy - Obstetrics And Gynaecology
- ↑ 2.0 2.1 2.2 "Indira Ramamurthi dead". హిందూ పత్రిక. 2009-11-08.
- ↑ "History of the Department". Archived from the original on 2015-07-12. Retrieved 2015-06-18.