ఇజ్రాయిల్‌లో హిందూమతం
ఇజ్రాయెల్‌లో హిందూ మతం అంటే ఇజ్రాయెల్‌లోని హిందూ జనాభాను సూచిస్తుంది.
హరేకృష్ణులు
మార్చుకట్జీర్-హరీష్‌లో భక్తుల సమూహం నివసిస్తోంది. ఇజ్రాయెల్‌లోని మరో వైష్ణవ సమాజం ఏరియల్‌లో ఉంది. దీనికి జగదీష్, అతని భార్య జుగాలా-ప్రీతి నాయకత్వం వహిస్తున్నారు. CISలో తీవ్రమైన ఆర్థిక అణచివేత నుండి తప్పించుకోవడానికి రష్యా నుండి వలస వచ్చిన భక్తుల సంఘానికి సేవ చేస్తున్నారు. జుగాలా-ప్రీతి 1996లో గుణావతార్, వర్షభానవిల మార్గనిర్దేశనంలో టెల్ అవీవ్‌లోని ఇస్కాన్ కేంద్రంలో చేరింది. [1]
ఇజ్రాయెల్‌లో హిందూ పండుగలు
మార్చుకృష్ణ జన్మాష్టమి
మార్చుదేశంలో హిందువులు స్వేచ్ఛగా మతాన్ని ఆచరిస్తారు. ఇది ముఖ్యంగా కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో తెలుస్తుంది. ఆటపాటలతో పాటు కృష్ణుని చిన్ననాటి కథలను నాటకాలుగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో 108 వంటకాలతో కూడిన విందు కూడా ఉంటుంది. ఈ సంఖ్యను పవిత్రమైనదిగా భావిస్తారు. [2]
తాము కుంభ స్ఫూర్తితో మూడేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ సందర్శకుల్లో చాలామంది భారతదేశం వెళ్ళి వచ్చారు లేదా వెళ్ళాలనుకుంటున్నారు. చాలామంది యువకులు యోగా క్లాసులు తీసుకోవడం, హరేకృష్ణ ఉపన్యాసాలకు హాజరవడం చూడవచ్చు. అన్నం, పప్పు చారు అందించే భారతీయ 'ధాబా ' వెలుపల పొడవైన క్యూలు కనిపించాయి. మధ్య వయస్కులైన జంటలు, భారతీయ దుస్తులు ధరించి, బీచ్‌లో విహరించారు. యువకులు, బాలికలు మెత్తటి ఇసుక మీద బొమ్మలు గీసారు. మరికొందరు ఉదయ సముద్రంలో సర్ఫ్ చేశారు.
ఇజ్రాయెల్‌లోని సాయి సంస్థ
మార్చుఇజ్రాయెల్ లో సాయి ఆర్గనైజేషన్ అధికారికంగా 2001 లో స్థాపించబడింది [3]
ఇజ్రాయెల్‌లోని శివానంద యోగా వేదాంత సంస్థ
మార్చుఇక్కడి శివానంద యోగా వేదాంత సంస్థ అంతర్జాతీయ శివానంద యోగా వేదాంత కేంద్రానికి శాఖ. ఇది భారతదేశం రిషికేశ్‌లోని శ్రీ స్వామి శివానంద ప్రత్యక్ష శిష్యుడైన స్వామి విష్ణుదేవానంద స్థాపించాడు.
ఈ కేంద్రాన్ని 1971లో ప్రారంభించారు. అప్పటి నుండి ఈ కేంద్రం ఇజ్రాయెల్‌లోని అన్ని శాఖలలో శాస్త్రీయ యోగాధ్యయనం, యోగాభ్యాసాలకు అతిపెద్ద, అత్యంత సమగ్రమైన పాఠశాలగా ఉంది. ఇక్కడ లభించే అధ్యయన విశేషాలు:
- యోగాసనాల సాధన
- ప్రాణాయామం
- యోగాభ్యాసంతో మానసిక ఒత్తిడి నిర్వహణ
- యోగ శాకాహారం
- సానుకూల దృక్పథం
- శాస్త్రీయ ధ్యానం
కేంద్రాలు
మార్చు1971 నుండి, వారి కార్యకలాపాలు గణనీయంగా విస్తరించాయి. ఇప్పుడు జెరూసలేం, పర్దేస్, ఈలాట్, టివాన్ నగరాల్లో కూడా కేంద్రాలు పనిచేస్తున్నాయి
అంతర్జాతీయ సంస్థ తరపున వేలాది మంది ఇజ్రాయిలీలు యోగా ఉపాధ్యాయులుగా శిక్షణ పొందారు. వీరు దేశవ్యాప్తంగా పని చేస్తున్నారు, బోధిస్తున్నారు.
టెల్ అవీవ్‌లోని శివానంద యోగా కేంద్రం
మార్చుటెల్ అవీవ్‌లోని శివానంద యోగా సెంటర్ ఇప్పుడు యోగా స్టూడియో మాత్రమే కాదు. ఈ పాఠశాల మూడు అంతస్తుల భవనంలో ఉంది. ఇక్కద కింది అంశాలను బోధిస్తారు:
- పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ప్రత్యేక అవసరాలు, మరిన్నింటి కోసం శాస్త్రీయ యోగాభ్యాస తరగతులు
- వివిధ స్థాయిలలో వర్క్‌షాపులు, యోగా కోర్సులు
- వర్క్‌షాపులు, మెడిటేషన్ కోర్సులు
- సానుకూల ఆలోచన కోర్సులు
- ఉప-చేతన ట్యుటోరియల్స్, గైడెడ్ ఇమేజరీతో పని చేయడం
- వంట వర్క్‌షాపులు, యోగ శాకహారం
- ఆరోగ్యకరమైన ఒత్తిడి నిర్వహణ
మూలాలు
మార్చు- ↑ "Waves of Devotion - Journals: May 2002 Archives". www.wavesofdevotion.com. Archived from the original on 2018-11-12. Retrieved 2021-11-26.
- ↑ "Janmashtami celebrated in Israel with fanfare". Archived from the original on 2007-10-24.
- ↑ "Sathya Sai Israel - סאתיה סאי באבא". Satya Sai.org. 2012-12-18. Archived from the original on 2014-08-04. Retrieved 2021-04-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)