ఇద్దరు కొడుకులు (1962 సినిమా)

ఇద్దరు కొడుకులు 1962, మార్చి 16న విడుదలైన డబ్బింగ్ సినిమా. తాయ్ సొల్లై తట్టదె అనే తమిళ సినిమా దీని మాతృక.

ఇద్దరు కొడుకులు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
బి. సరోజాదేవి,
కన్నాంబ,
జెమినిచంద్ర
సంగీతం ఎల్.మల్లేశ్వరరావు
గీతరచన గబ్బిట వెంకటరావు
నిర్మాణ సంస్థ అమృత కళా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

 • ఎం.జి.రామచంద్రన్
 • అశోకన్
 • ఎం.ఆర్.రాధా
 • జెమిని చంద్ర
 • బి.సరోజాదేవి
 • కన్నాంబ
 • శాండో చిన్నప్ప దేవర్

సాంకేతికవర్గం సవరించు

 • దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
 • సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు
 • కథ: ఆరూర్ దాస్
 • మాటలు, పాటలు: గబ్బిట వెంకట్రావు

కథ సవరించు

రాజమ్మ అనే ఆమె భర్తను కోల్పోయి ఇద్దరు కొడుకులతో కాలం వెళ్లబుచ్చుతూవుంటుంది. పెద్ద కుమారుడు మోహన్ చెడుసావాసాలు మరిగి గజదొంగగా మారతాడు. రెండవ కొడుకు రాజు బుద్ధిగా చదువుకొని సి.ఐ.డి. ఉద్యోగం చేస్తూవుంటాడు. రైల్లో జరిగిన దోపిడీ కూపీ లాగడానికి రాజు పట్టణానికి వస్తాడు. అదే పట్టణంలో ముందే అడుగు పెట్టిన మోహన్ పగలు బ్యాంకర్, రాత్రి దొంగగా వ్యవహరించే మాధవయ్య ముఠాలో చేరతాడు. మాధవయ్య కూతురు విజయ టెన్నీస్ ఆటలో ఫస్ట్ ప్రయిజు పొందడం చూసి రాజు ఆమెను ప్రేమిస్తాడు. రాజుకు తన కుమార్తెను ఇచ్చి పెళ్లిచేయాలని నిశ్చయించుకున్న మాధవయ్య రాజు ఇంటికి వెళ్లి అతడు సి.ఐ.డి.ఆఫీసర్ అని తెలుసుకుంటాడు. కాఫీ తెచ్చిన రాజమ్మ తన భర్తను చంపిన మాధవయ్యను చూచి నువ్వా భద్రాచలం అని నాలుగు చివాట్లు పెట్టి తరిమివేస్తుంది.తన భర్తను చంపినవారి కుమార్తెను కోడలుగా స్వీకరించడానికి రాజమ్మ నిరాకరిస్తుంది. అక్కడ మాధవయ్య కూడా తన కుమార్తెను ఇదే ధోరణిలో హెచ్చరిస్తాడు. గుడి నుండి ఇంటికి తిరిగివస్తూ తుఫానులో చిక్కుకున్న రాజమ్మను విజయ రక్షించి ఇంటికి చేరుస్తుంది. ఆమె మాధవయ్య కూతురు అని తెలుసుకున్న రాజమ్మ విజయను తుఫానులోనే ఇంటి నుండి వెళ్ళగొడుతుంది. రాజు ఆమెను చూస్తాడు. తడిచి ముద్దయిపోతున్న రాజు, విజయలను రాజమ్మ ఇంటిలోకి తీసుకువెళుతుంది.[1]

పాటలు సవరించు

గబ్బిట రాసిన ఈ సినిమాలోని పాటలకు మల్లేశ్వరరావు బాణీలు కూర్చాడు.[2]

 1. ఒంటరి పిల్లను పిలిచేను వన్నె చిన్నెలు వొలికేను - పి.సుశీల
 2. కానయెల్ల విరిసేనే కన్నెపిల్ల మురిసేనే సిరిగల మల్లెతీగ - పి.సుశీల
 3. తలచి తలచి చెంత చేరితినే నిను వలచి వలచి - ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
 4. పట్టుచీర జీరాడ పరువమున తను వల్లాడ - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
 5. పాటా ఒక పాటా ఆనందం తాండవించు ఒకే పాట - పి.బి.శ్రీనివాస్ ,పి.సుశీల
 6. ప్రేమించిన ప్రియుని కనుగొననీ జీవితమేలా ధరపై - పి.సుశీల
 7. మనలో మనకు భేధం తెచ్చే మాయాలోకంరా జీవా - ఘంటసాల

మూలాలు సవరించు

 1. ఎ.ఎస్.ఆర్. (25 March 1962). "చిత్ర సమీక్ష - ఇద్దరు కొడుకులు" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 19 డిసెంబర్ 2022. Retrieved 21 February 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)
 2. కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 21 February 2020.