ఇన్ కార్ 2023లో తెలుగులో విడుదలైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ సినిమాకు హర్ష వర్ధన్ దర్శకత్వం వహించాడు. రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయగా,[1] సినిమాను 2023 మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[2]

ఇన్ కార్
దర్శకత్వంహర్ష వర్ధన్
రచనహర్ష వర్ధన్
నిర్మాతఅంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి
తారాగణంరితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా
ఛాయాగ్రహణంమిథున్ గంగోపాధ్యాయ
కూర్పుమాణిక్ దివార్
సంగీతంమథియాస్ డుప్లెసిస్
నిర్మాణ
సంస్థ
ఇన్‌బాక్స్ పిక్చర్స్
విడుదల తేదీ
3 మార్చి 2023
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్లాలని బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సాక్షి (రితికా సింగ్) నలుగురు కుర్రాళ్ళు ట్రాప్ చేసి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయాలనుకుంటారు. వారి నుంచి రితికా ఎలా తప్పించుకొంది. చివరికి ఆమె వారిని పోలీసులకు అప్పగించిందా ? అసలు ఆ నలుగురు ఎవరు..? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • రితిక సింగ్[4]
  • సందీప్ గోయత్
  • మనీష్ ఝంజోలియా
  • జ్ఞాన్ ప్రకాష్
  • సునీల్ సోని

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఇన్‌బాక్స్ పిక్చర్స్
  • నిర్మాత: అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హర్ష వర్ధన్
  • సినిమాటోగ్రఫీ: మిథున్ గంగోపాధ్యాయ
  • మాటలు : సుధీర్ కుమార్, హర్ష్ వర్ధన్
  • అడిషనల్ డైలాగ్స్ : తుషార్ ఖండేల్వాల్
  • సంగీతం : మథియాస్ డుప్లెసిస్
  • ఎడిటర్: మాణిక్ దివార్
  • ఫైట్స్: సునీల్ రోడ్రిగ్స్
  • ఆర్ట్: చేతన్ సాగర్

మూలాలు మార్చు

  1. Mana Telangana (17 February 2023). "'ఇన్ కార్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  2. NTV Telugu (25 February 2023). "యదార్థ సంఘటనల ఆధారంగా 'ఇన్ కార్'!". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  3. A. B. P. Desam (3 March 2023). "'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  4. Mana Telangana (25 February 2023). "'ఇన్ కార్' అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా: రితిక సింగ్". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇన్_కార్&oldid=3901817" నుండి వెలికితీశారు