ఇళంగో అడిగళు
ఇళంగో అడిగళు సాంప్రదాయకంగా తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన సిలప్పాధికారం రచయితగా పేరు పొందారు. పురాణ కవితకు ఒక పత్తికం (నాంది) లో, అతను తనను తాను ఒక ప్రసిద్ధ చేర రాజు సెంగుట్టువను సోదరుడిగా గుర్తింపబడినాడు. ఈ చేరరాజు 2 వ శతాబ్దం చివరిలో లేదా 3 వ శతాబ్దం ప్రారంభంలో తన రాజ్యాన్ని పరిపాలించాడని ఎలిజబెతు రోసెను సూచిస్తుంది. [1][2] అయినప్పటికీ ఇది సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే పాటిసుప్పట్టులోని ఒక సంగకాల పద్యం - ఐదవ పది - సెగుట్టువాను, ఆయన కుటుంబం పాలన, జీవిత చరిత్రను అందిస్తుంది, కాని ఆయనకు సన్యాసిగా మారిన లేదా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇతిహాసాలలో ఒకటైన సిలప్పధికారం ఇతిహాసాన్ని రచించిన ఒక సోదరుడు ఉన్నారని ఎప్పుడూ ప్రస్తావించలేదు.[3] పురాణ రచయిత ఇళంగో అడిగళు పురాణాన్ని తరువాత ఇతిహాసంలో చేర్చారని పరిశోధకులు తేల్చారు.[3][4] 1968 నాటి కమిలు జ్వెలెబిలు వ్రాతలలో "ఈ అడిగలళు దావా కొంచెం కవితా అద్భుత రచనా కల్పన కావచ్చు. దీనిని చేర రాజవంశం తరువాతి సభ్యుడు (5 లేదా 6 వ శతాబ్దం)[5]మునుపటి సంఘటనలను గుర్తుచేసుకున్నాడు (2 వ లేదా 3 వ శతాబ్దం). [1]
జీవిత చరిత్ర
మార్చుఇళంగో ఆడిగళు ("గౌరవనీయమైన సన్యాసి యువరాజు"), ఇళంగో అడిగళు (ఇవాంగోవాడిగల్ అని కూడా పిలుస్తారు), సాంప్రదాయకంగా సిలప్పధిక్కథికారం రచయిత అని విశ్వసిస్తున్నారు. ఆయన గురించి ధ్రువీకరించదగిన ప్రత్యక్ష సమాచారం అందుబాటులో లేదు.[6] ఆయన అనేక శతాబ్దాల తరువాత ఇతిహాసంలో కూర్చిన, చొప్పించిన ఒక పతికం (నాంది) ఆధారంగా జైన సన్యాసిగా మారిన యువరాజు అని నమ్ముతారు.[6] చెంగుట్టువను రాజు నేడుంజెళియను, చోళ రాజవంశానికి చెందిన సోనాయి (నల్చోనై) చిన్న కుమారుడిగా ఇళంగోను భావిస్తారు. ఆయన అన్నయ్య పేరున్న యోధుడు-రాజు సెంగుట్టువను అని విశ్వసిస్తారు. అయినప్పటికీ ఈ సాంప్రదాయిక నమ్మకాలు సందేహాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే సంగయుగం వచనం పాటిసుప్పట్టు రాజు నేడుంజెళియను, రాజు సెంగుట్టువను జీవిత చరిత్రను అందిస్తుంది. ఇళంగో అడిగళు ఎప్పుడూ ప్రస్తావించలేదు.[3][7][8]
ఇతిహాసం అనేక భాగాలలో ఉన్నట్లు రచయిత బహుశా జైన పండితుడు. ఇతిహాసం ముఖ్య పాత్రలు జైన సన్యాసి లేదా సన్యాసినిని కలుస్తాయి.[6][9] ఇతిహాసం చివరి అధ్యాయంలో 155-178 పంక్తులు, "నేను కూడా లోపలికి వెళ్ళాను" అని పేర్కొంది. దీనిలో "నేను" పండితులు రచయిత అడిగళు అని భావించారు.[6] ఇతిహాసం ఇతర వివరాలతో "గజబాహు సింక్రోనిజం" గురించి కూడా ప్రస్తావించింది. సా.శ..171-193 మధ్య సిలోను (శ్రీలంక) రాజు అని నమ్ముతున్న గజబాహు సమక్షంలో సెంగుట్టువను రాజు చేసిన వేదకాల యాగానికి అడిగళు హాజరైనట్లు ఈ శ్లోకాలు చెబుతున్నాయి.[10] ఇదే కాలంలో అడిగళు నివసించిన ప్రతిపాదనలకు ఇది దారితీసింది. 2 వ శతాబ్దపు చేర రాజ్యానికి రాజధాని (ఇప్పుడు కేరళలోని భాగాలు) - వాన్సీ వెలుపల ఉన్న ఒక ఆశ్రమంలో ఆయన సన్యాసి అయ్యాడని కూడా ఈ పంక్తులు పేర్కొన్నాయి. ఈ ప్రకటన అర్ధం జైన సన్యాసిగా అవతరించింది.[6] కామిలు జ్వెలెబిలు అభిప్రాయం ఆధారంగా ఇళంగో అడిగళు ఆయన వ్రాసిన ఇతిహాసంలో సామూహిక స్మృతులలో ఒక భాగంగా ఉండటానికి జోడించిన వ్యూహాత్మక చొప్పింత అయి ఉండాలి.[11] అడిగళు కొన్ని శతాబ్దాల తరువాత జీవించిన ఒక జైనుడని జ్వెలెబిలు పేర్కొన్నాడు. ఆయన ఇతిహాసం "5 వ లేదా 6 వ శతాబ్దానికి ముందు కూర్పు చేయబడలేదు" అని సూచించాడు.[10]
గణనాథు ఒబెసేకెరె - బౌద్ధమత పండితుడు శ్రీలంక మత చరిత్ర, మానవ శాస్త్రం పరిశోధకుడు గజబాహు ఇతిహాసం వాదనలు ఇళంగో అడిగళు, సెంగుట్టువన్ల మధ్య బంధుత్వం చారిత్రాత్మకమైనదని ఈ పంక్తులు తమిళ ఇతిహాసంలో "ఆలస్యంగా చేసిన చొరబాటు"గా భావిస్తారు.[8][6] రచయిత రాకుమారుడు కాకపోవచ్చు. చేర రాజవంశంతో సంబంధం లేదు అని ఆర్ పార్థసారథి చెప్పాడు. ఈ పంక్తులు ఇతిహాసానికి చేర్చబడి ఉండవచ్చు. ఈ వచనానికి అధిక వంశపు హోదా ఇవ్వడానికి రాజుమద్దతును పొందటానికి సంస్థాగతీకరించడానికి ఇతిహాసంలో వివరించిన విధంగా తమిళ ప్రాంతాలలోని దేవత అయిన పట్టిని, ఆమె దేవాలయాల ఆరాధన చొప్పించబడింది.[6]
రామచంద్ర దీక్షితారు అభిప్రాయం ఆధారంగా ఇళంగో అడిగళు గురించి సన్యాసి-యువరాజు పురాణం సిలప్పధికారం చివరి ఖండంలో చేర్చబడింది. ఇతిహాసంలో కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయడానికి రాజు హిమాలయం నుండి రాయిని తిరిగి తెచ్చిన తరువాత ఇళంగో అడిగళు చేర రాజు సెంకుట్టువనుతో కలిసి వేదకాల యాగానికి హాజరవుతాడు.[12] ఒక జైన సన్యాసి అయిన రచయిత ఇళంగో అడిగళు వేదాలు, వేదకాల యాగాలు గురించి జైన మతం చారిత్రక దృక్పథం [తిరస్కరణ] గురించి మనకు అవగాహనను ఇస్తే ఆయన వేదకాల యాగాలు వంటి కార్యక్రమానికి ఎందుకు హాజరవుతాడని రామచంద్ర దీక్షితారు పేర్కొన్నాడు.[13] ఇది ఇతిహాసం శైవ, వైష్ణవ జీవనశైలి, పండుగలు, దేవతలను, దేవుళ్ళను హాయిగా ప్రశంసిస్తుండటం కొంతమంది పరిశోధకులు సిలప్పధికారం ఇతిహాసం రచయిత హిందువు అని ప్రతిపాదించడానికి దారితీసింది.[12]
మరొక తమిళ పురాణం ఆధారంగా ఒక జ్యోతిష్కుడు ఆయన భూమికి పాలకుడు అవుతాడని ఊహించాడు. దీనిని ఆపడానికి ఆయన అన్నయ్య రాజుగా ఉండటానికి యువరాజు ఇళంగో అడిగళు పేరును తీసుకొని జైన సన్యాసి అయ్యాడని సూచించింది.[ఆధారం చూపాలి]
వారసత్వం
మార్చుఇళంగో అడిగళుకు ఘనత ఇచ్చిన సిలపతికరం ఇతిహాసం మణిమేకలై అనే మరో తమిళ కవితా ఇతిహాసానికి ప్రేరణనిచ్చింది. ఈ కవితా ఇతిహాసం సిలప్పధికారానికి కొనసాగింపుగా పనిచేస్తుంది. ఇది కోవాలను (సిలప్పతికరం కథానాయకుడు), మాధవి (సిలప్పధికారంలో కోవలనుతో ఎఫైరు కలిగి ఉన్నది), మణిమేకలై అనే కుమార్తె చుట్టూ తిరుగుతుంది. మణిమేకలై తల్లి మాధవి అయినప్పటికీ ఆమె పట్టిని దేవిని పూజించింది (కణ్ణగి, కోవలను భార్య).
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Rosen, Elizabeth S. (1975). "Prince ILango Adigal, Shilappadikaram (The anklet Bracelet), translated by Alain Damelou. Review". Artibus Asiae. 37 (1/2): 148–150. doi:10.2307/3250226. JSTOR 3250226.
- ↑ Adigal 1965, p. VIII.
- ↑ 3.0 3.1 3.2 Iḷaṅkōvaṭikaḷ; R Partaasarathy (2004). The Cilappatikāram: The Tale of an Anklet. Penguin Books. pp. 6–8. ISBN 978-0-14-303196-3.
- ↑ Gananath Obeyesekere (1970). "Gajabahu and the Gajabahu Synchronism". The Ceylon Journal of the Humanities. 1. University of Sri Lanka: 44.
- ↑ Kamil Zvelebil 1973, pp. 174–176.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 R Parthasarathy (Translator) 2004, pp. 6–7.
- ↑ Kamil Zvelebil 1973, pp. 52–53.
- ↑ 8.0 8.1 Gananath Obeyesekere (1970). "Gajabahu and the Gajabahu Synchronism". The Ceylon Journal of the Humanities. 1. University of Sri Lanka: 42–45.
- ↑ Kamil Zvelebil 1973, pp. 172–181.
- ↑ 10.0 10.1 Kamil Zvelebil 1973, pp. 174–177.
- ↑ Kamil Zvelebil 1973, p. 179.
- ↑ 12.0 12.1 V R Ramachandra Dikshitar 1939, pp. 67–69.
- ↑ V R Ramachandra Dikshitar 1939, p. 69.
గ్రంధ సూచిక
మార్చు- V R Ramachandra Dikshitar (1939), The Silappadikaram, Oxford University Press
- Adigal, Prince Ilangô (1965), Shilappadikaram: (The Ankle Bracelet), translated by Alain Daniélou, New Directions, ISBN 9780811200011
- The Cilappatikāram: The Tale of an Anklet (Iḷaṅkōvaṭikaḷ). Translated by R, Parthasarathy. Penguin Books. 2004. ISBN 978-0-14-303196-3.
- Kamil Zvelebil (1973). The Smile of Murugan: On Tamil Literature of South India. BRILL. ISBN 90-04-03591-5.