ఈజీ జెట్ ఎయిర్‌లైన్స్
ఈజీ జెట్ అనేది బ్రిటీష్ చవక ధరల విమానయాన సంస్థ. ఇది లండన్ లుటాన్ విమానాశ్రయం ఆధారంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.[3] ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఇది యునైటెడ్ కింగ్ డమ్ లో అతి పెద్ద వైమానిక సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 32 దేశాల్లోని 700 మార్గాల్లో విమానాలను నడిపిస్తోంది.[4] ఈజీ జెట్ సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంచీలో నమోదు కావడమే కాకుండా దీనికి ఎఫ్.టి.ఎస్.ఇ. 100 సూచిక కలిగి ఉంది.[5]
![]() | ||||
| ||||
స్థాపితము | 1995 | |||
---|---|---|---|---|
AOC # | 2091 | |||
Operating bases | List of bases
| |||
Fleet size | 215 | |||
గమ్యస్థానములు | EasyJet destinations | |||
సంస్థ నినాదము | "europe by easyJet" "business by easyJet" "This is Generation easyJet" | |||
మాతృసంస్థ | EasyJet plc | |||
ప్రధాన కార్యాలయము | London Luton Airpor] Luton, United Kingdom | |||
కీలక వ్యక్తులు |
| |||
ఆదాయము | ![]() | |||
Operating income | ![]() | |||
స్థూల ఆదాయమ్ | ![]() | |||
మొత్తం ఆస్తులు | ![]() | |||
Total equity | ![]() | |||
ఉద్యోగులు | 9,649 (2014)[2] | |||
వెబ్‌సైటు | easyjet.com |
విషయ సూచికసవరించు
- 1 చరిత్ర
- 2 ప్రధాన కార్యాలయం
- 3 గమ్యాలు
- 4 విమానాలు
- 5 సేవలు
- 6 ఇవి కూడా చూడండి
- 7 బయటి లింకులు
- 8 మూలాలు
చరిత్రసవరించు
ఈ ఎయిర్ లైన్ సంస్థ ఈజీ గ్రూప్ తన వ్యాపార విస్తరణలో భాగంగా 1995 లో ప్రారంభించబడింది. గ్రీక్ ప్రముఖ వ్యాపార వేత్త సర్ స్టిలియస్ హాజి-ఇవానోవ్ దీనిని స్థాపించారు. ఆరంభంలో రెండు బోయింగ్ 737-200 విమానాలను అద్దెకు తీసుకుని దీని కార్యకలాపాలను ప్రారంభించారు. ఏప్రిల్ 1996లో easy jet తన తొలి విమానాన్ని కొనుగోలు చేసింది.
ప్రధాన కార్యాలయంసవరించు
ఈజీ జెట్ ప్రధాన కార్యాలయం లుటాన్ నగరంలోని లండన్ లుటాన్ ఎయిర్ పోర్ట్ లో గల హాంగర్ 89 (హెచ్89) భవనంలో ఉంది. హాంగర్ 89 భవనాన్ని 1974లో నిర్మించారు. దీని వైశాల్యం 30,000 చదరపు అడుగులు (2,800 చ.మీ.). ఈజీజెట్ ఆధునీకరణ తర్వాత ఈ భవనానికి ఆరెంజ్ (కాషాయ) రంగు వేశారు.[6]
గమ్యాలుసవరించు
ప్రధాన వ్యాసం: ఈజీ జెట్ గమ్యాలు
ఈజీ జెట్ విమానాలు ఐదు అతి పెద్ద ఆధార స్థావరాల నుంచి నడుస్తున్నాయి. అవి పరిమాణాల ప్రకారం... లండన్–గాట్విక్, మిలాన్–మల్ పెన్సా, లండన్–లుటాన్, బ్రిస్టాల్, లండన్–స్టాన్ స్టెడ్. ఇవి గాకుండా టౌలౌజ్ విమానాశ్రయం ప్రస్తుతం ఉన్న వాటిలో అతి చిన్న బేస్ గా చెప్పవచ్చు. ఇక్కడి నుంచి రెండు విమానాలు మాత్రమే నడుస్తాయి.
ఈజీ జెట్ కు 19 యూరోపియన్ బేస్ లు ఉన్నాయి. ఇది పేరుకు బ్రిటీష్ ఎయిర్ లైన్ అయినప్పటికీ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇతర యూరోపియన్ దేశాలకు విమానాలను నడిపిస్తోంది. బ్రిటన్ లో అతి పెద్ద విమాన మార్కెట్ ను ఈ సంస్థ కలిగి ఉంది.
విమానాలుసవరించు
మే 2015 నాటికి ఈజీ జెట్ ఈ క్రింది విమానాలను కలిగి ఉంది.:
ఈజీ
జెట్ విమానాలు | |||||
---|---|---|---|---|---|
విమానం | సేవలో | ఆర్డర్లు | ఆప్షన్లు | ప్రయాణికులు | సూచనలు |
ఎయిర్
బస్ ఎ319-100 |
137 | _ | _ | 156 | అతిపెద్ద
ఎ 319 ఆపరేటర్ |
ఎయిర్
బస్ ఎ320-200 |
77 | 56 | _ | 180 | 2018
నాటికి 186 సీట్లకు పెంచుకోవడానిక అనుమతి[52 |
ఎయిర్
బస్ ఎ320నియో |
_ | 100 | 100 | టి.బి.సి.180-189 | 2017-2022 మధ్య
డెలివరీలు |
మొత్తం | 214 | 156 | 100 |
సేవలుసవరించు
ఈజీ జెట్ విమానాల క్యాబిన్లన్నీ ఒకే తరగతి (శ్రేణి) లో ఉంటాయి.[7] ఈ విమాన సంస్థ యొక్క ప్రధాన విమానాలు ఎయిర్ బస్ ఎ 319, ఎ 320 రకానికి చెందినవి. ఇవి 156, 180 మంది ప్రయాణికులను తీసుకెళ్తాయి. ఇవన్నింటిలోనూ ఒకే తరగతిలో ఉన్నప్పటికీ తక్కువ రం ప్రయాణించే విమానాల్లో భోజన వసతి ఉండదు. ప్రతి విమానంలోఓ చిన్న వంటగది, మరుగుదొడ్డి ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో వినియోగించే విమానాల్లో మినహా ఎక్కడ కూడా కాంప్లిమెంటరీ బోజనం, ద్రవ పానియాలు ఇవ్వబడవు. ప్రయాణంలో కొనుగోలు కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులు తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు.[8] సాండ్ విచ్, కాల్చిన సాండ్ విచ్ లు, చాక్లెట్లు, స్నాక్స్, వేడి పానియాలు, సాఫ్ట్ డ్రింకులు, ఆల్కహాలిక్ పానియాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఈజీ జెట్ లో గతంలో ఇన్ ఫ్లైట్ వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉండేవి. కానీ క్రమేణా వాటిని నిలిపివేశారు. 2011, 2012 నుంచి మెజ్జో పరికరాలను అద్దె ప్రతిపాదికన ఎంపిక చేసిన విమానాల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఇన్ ఫ్లైట్ వినోదం పూర్తి రద్దు చేయబడింది. ఈజీ జెట్ లో కొనుక్కోవడానికి వీలుగా హెడ్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల కోసం ఒక పత్రికను అందుబాటులో ఉంచుతారు. ఈజీ జెట్ లో హలో,, ది సండే టైమ్స్, ది టైమ్స్ వంటి పత్రికలు అందుబాటులో ఉంటాయి.
బయటి లింకులుసవరించు
- అధికారిక వెబ్ సైట్
- విభాగాలు:
- 1995లో స్థాపించిన ఎయిర్ లైన్స్
- యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ఎయిర్ లైన్స్
- బ్రిటీష్ బ్రాండ్ లు
- లూటాన్ ఆధారిత కంపెనీలు
- లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన కంపెనీలు
- యూరోపియన్ చవక ధరల ఎయిర్ లైన్స్ అసోసియేషన్
- చవక ధరల ఎయిర్ లైన్స్
- ఈజీ గ్రూపు
మూలాలుసవరించు
- ↑ "IATA - Airline and Airport Code Search". iata.org. Retrieved 13 April 2015.
- ↑ "Annual Report 2014". EasyJet. Archived from the original on 23 జనవరి 2018. Retrieved 21 May 2015.
- ↑ "Company Profile". Uk.reuters.com. 17 January 2014. Archived from the original on 5 అక్టోబరు 2015.
- ↑ "Flights to European Destinations and Beyond". easyJet. 17 January 2014.
- ↑ "EasyJet". Cleartrip. Archived from the original on 2015-06-26.
- ↑ "New headquarters for EasyJet at London Luton Airport". easyJet. 28 January 2010. Archived from the original on 9 నవంబరు 2012.
- ↑ "EasyJet Boosts Order For Airbus A319s By 52 Aircraft". EADS. 14 November 2006.
- ↑ "EasyJet Shop May 2008" (PDF). EasyJet. 11 October 2008. Archived from the original (PDF) on 22 అక్టోబరు 2008.