ఈపూరులంక
ఈపూరులంక బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
మార్చుఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామంలో మౌలిక సదుపాయాలు
మార్చువైద్య సౌకర్యం
మార్చుప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. నర్సు గూడా నెలకొకసారి గూడా రాదు. తీవ్ర అనారోగ్యానికి గురైతే 18 కి.మీ. దూరంలోని కొల్లూరు గ్రామం వెళ్ళవలసినదే.
వీధి దీపాలు
మార్చువెలగవు.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామ పంచాయతీకి భవనం లేదు. మండలంలో పంచాయతీకి భవనం లేని గ్రామం ఇదొక్కటే.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, కడప జిల్లా రాజంపేట డి.ఎస్.పి. శ్రీ ఓలేటి అరవిందబాబు, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.