ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు

(ఈవీఎం నుండి దారిమార్పు చెందింది)

1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడుతుండటం వల్ల 10,000 టన్నుల కాగితం మిగులుతోంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఈవీఎం ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తాయి. విద్యుత్తు సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1400లోపు మంది ఓటర్లనే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వాడతారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపరు ఉపయోగిస్తారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా ఈవీఎంలనే ఉపయోగించారు.

ఈవీఎంలు భేష్ మార్చు

భారత్‌లో పలు ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించారు. అక్కడ సుమారు 60 కోట్లకుపైగా ఓటర్లుంటారు. నిరక్షరాస్యులు కూడా ఈవీఎంలోని పార్టీ బొమ్మలు చూసి ఓటేయడమే నన్ను ఆకట్టుకొంది అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే ఈవీఎంలు ఉపయోగిస్తున్నట్లున్నారు. వీటి నిర్వహణలో రాజకీయ పార్టీలకి ప్రమేయం ఉండదు. ఫలితాలపైనా విమర్శించడానికి అవకాశంలేదు అమెరికాలో కొన్ని అవాంతరాలున్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తాం-- హిల్లరీ క్లింటన్‌