ఈశ్వర సత్యనారాయణ శర్మ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యులు. వీరి దీక్షా నామము శ్రీయానంద నాథులు. వీరు అనేక వందల గ్రంథములు రచించి తెలుగు భాషకు ఆయుర్వేదానికి ఎనలేని సేవ చేశారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం పట్టణం.
జన్మ సమాచారము
మార్చుతల్లిదండ్రులు: శ్రీమతి కామేశ్వరమ్మ, ఈశ్వర సీతారామశాస్త్రి.
జన్మతిథి: 18-10-1886, వ్యయ నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ పంచమి సోమవారం తత్కాల షష్టి.
జన్మస్థలం: విశాఖపట్నం జిల్లా వీరవల్లి తాలూకా లోని చోడవరం.
వంశము: యజు శాఖ ఆపస్తంబ సూత్రులు, హరితస గోత్ర వెలనాడు బ్రాహ్మణులు ఇంటిపేరు ఈశ్వర వారు
విద్యాభ్యాసము
మార్చుతండ్రి అక్షర స్వీకారం చేయించి ఆంగ్లవిద్యలో చేర్పించినను, కులవృత్తి ఆయుర్వేదం కనుక దానికి సంస్కృతం అవసరం కనుక అందులో కూడా ప్రావీణ్యం సంపాదించారు. 1904లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తండ్రి గారికి తన కుమారుని ఆంగ్ల విద్యా విశారదునిగా చేయు కుతూహలము కలిగెను. కానీ శర్మ గారికి మాత్రం భారతీయ ఆయుర్వేదమందే మక్కువ ఎక్కువ. తన జనకుడు ఆరాధించిన జగజ్జనని, తన పుత్ర రత్నం అయిన శర్మ గారిచే వైద్య గ్రంథములు భగవంతునీ శతకములు, యక్ష గానములు అద్వైత మత గ్రంధములు ఎన్నో వ్రాయించి ఎందరికో విద్యాదానము చేయించి, ఎందరికో యోగ దీక్షను ఇప్పించి లోకముననుగ్రహించెను.
కవితాది లలిత కళలు
మార్చుఆంధ్ర భాషా నిఘంటువు బాగా అభ్యాసం చేసి స్వయం కృషి మూలంగా పాండిత్యం గడించారు. తన ప్రథమ ప్రయత్నముగా భాస్కర నక్షత్రమాలను రచించి వారి గురువులైన దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్దకు తీసుకొని పోయినప్పుడు వారు ఆ పద్యములు అన్నీ చదివి, నాయనా నీకు చక్కని కవితాధార ఉంది గాని ఐదారు ఆంధ్ర వ్యాకరణ దోషములు ఉన్నవి. వెంటనే చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం నీవు బాగా అభ్యసించి తర్వాత ఈ పుస్తకమును పరిష్కరించి నాకు తెచ్చి చూపమని ఆదేశించారు. వీరు పది దినములు 10 పాఠములు గా బాలవ్యాకరణము చదివి ముగించిరి.
ఉపనయన వివాహములు
మార్చువీరికి 9వ యేటనే ఉపనయన మైనది. వీరి తండ్రి శ్రీవిద్యోపాసకులు అవుట వలన తన కుమారునికి ఉపాసన యందు ఉన్న శ్రద్ధను చూసి ఒక చంద్రగ్రహణ వేళ దక్షిణామూర్తి మంత్రదీక్షనిచ్చిరి. ఆ ఉపాసనా బలమే తనని ఇంత శ్రీవిద్యోపాసనిరతునిగా తీర్చిదిద్దినదని వీరి విశ్వాసం. శర్మగారికి 16వ ఏటనే కూచిభొట్ల సూర్య ప్రకాశరావు పంతులు గారి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసారు ఆమె అల్పాయుష్ష్కురాలు అయినందువలన నాలుగేళ్లలోనే ఆమె దివంగతురాలయినది.వెంటనే విజయనగరం నివాసులైన పిలకా మూర్తి రాజు గారి రెండవ కుమార్తె కామేశ్వరమ్మ ఇచ్చి వివాహం చేసిరి.శర్మ వరప్రసాదంగా వెంకట సూర్యనారాయణ శర్మ ఒక్కరే పుట్టిరి.
రచనలు
మార్చుశర్మ తన ఉపాసనా బలం తో, నిరంతర కృషితో, శతానేక గ్రంథాలు రచించారు. అందులో భక్తి, జ్ఞానోపాసన గ్రంథములు, యక్షగానాలు, శతకాలు, మంత్ర, తంత్ర గ్రంధాలు అనేకం ఉన్నాయి. కొన్నిటిని దిగువనున్న పట్టికలో చూడండి
క్రమ సంఖ్య | గ్రంథం పేరు | గ్రంథ విశేషం | వర్గీకరణ |
1 | భాస్కర నక్షత్రమాల | ఇది శర్మ గారి మొట్టమొదటి కవితా విలాసం | కవితా సంపుటి |
2 | అరసవిల్లి క్షేత్రమహత్యం | తన తల్లి గారికి బొల్లి వ్యాధి వచ్చినప్పుడు, సౌర మంత్రోపాసన చేసి దానిని నిర్మూలించారు. ఈ విషయం తన మహాసౌర మంత్ర పాఠం అనే గ్రంథంలో ముందుమాటలో చెప్పారు. | |
3 | జానకీశ్వర శతకము | శతకము | |
4 | శ్రీ శర్మద రామాయణం | వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వ్రాయబడినది. శర్మ మంచి గాయకులు, అందుకే యక్షగాన రచన చాలా కష్టమైనా భగవంతుడు గాన లోలుడు అనే దృఢ విశ్వాసంతో మృదుమధురమైన రామ కధాసుధారసమును తన గానకళ తో మేళవించి ఈ కృతి వ్రాశారు. ఇది ఆయనకు అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టింది. ఎందరో హరికథా కళాకారులకు జీవనాధారం అయింది. | యక్షగానము |
5 | అద్భుతోత్తరకాండము | యక్షగానము | |
6 | మయూరధ్వజ చరిత్రము | యక్షగానము | |
7 | వామన చరిత్రము | రామతీర్థ పండితుల కోరికపై వ్రాయబడిన యక్షగానం | యక్షగానము |
8 | భక్త నందనార్ | శివభక్తి మహిమ బోధక ము | యక్షగానము |
9 | సతీ సులోచన | తులసి రామాయణం లోనిది | యక్షగానము |
10 | లక్ష్మీ విజయము | లక్ష్మికి శనిపై గెలుపు | యక్షగానము |
11 | త్యాగరాజ చరిత్రము | పైన చెప్పిన యక్షగానాలన్నీ హరికధా గానాన్నే వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్న తన శిష్యుల కోసం రాసినవి.వీరి ప్రధాన శిష్యులు శ్రీకూర్మం దాసుఅను పేరు గల శ్రీమాన్ భాగవత రత్న చామర్తి కుర్మాచార్యులు గారు, ఈయన జగమెరిగిన హరి కథ కళాకారుడు. శ్రీమాన్ చిలక వెంకట కృష్ణదాసు కూడా ఈయన శిష్యులే.శర్మయక్షగాన రచయితలే కాక స్వయంగా హరికథా కళాకారులు కూడా. ఎన్నో పర్వదినాల్లో తన శిష్యుల కోరిక మేరకు వేరే ఊర్లు వెళ్లి కూడా ఆయన హరికథలు చెప్పేవారు. ఈయన 67 ఏళ్ళ వయసులో కూడా దసరా నవరాత్రులు, శ్రీరామనవమికి హరికథలు చెప్పేవారు. | యక్షగానము |
సౌందర్య లహరి | శ్రీ శంకరభగవత్పాదుల కృతికి అనువాదం | ||
12 | శ్రీదేవి పంచస్తవి | మహాకవి కాళిదాసు కృతికి అనువాదం | |
13 | అమ్మతో ముచ్చటలు | ఆయన స్వయంగా అమ్మవారితో మాట్లాడినప్పుడు కలిగిన అనుభవములు విశేషములు పద్యరూపంలో వ్రాశారు | |
14 | బాలాంబికా శతకము | శ్రీ దేవి స్తుతి శతక రత్నం | శతకము |
15 | శ్రీ సూక్త రహస్యార్ధ వివరణము | శర్మ గారి ఉపాసనా బలం, సాహిత్య సంపద, సునిశిత విమర్శనా జ్ఞానం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. | |
16 | హ్రీంకార శతకము | హ్రీం బీజమునకు నూరు అర్థములు ఇందులో చెప్పారు | శతకము |
17 | మహా సౌర మంత్ర పాఠము | ఋగ్వేద మంత్రములను తేట తెలుగు పద్య రూపంలో అనువదించారు | |
18 | పండుగ కట్నము | సాంఘిక కథ | |
19 | అయుస్సాధనము | ||
20 | సారంగధర త్రిశతి | శతకానువాదము | |
21 | శిశు వ్యాధులు | వైద్య గ్రంథము | |
22 | పుత్రవతీ హితోపదేశములు | బాలింతలు నిత్యపారాయణ చేయదగిన గ్రంథం | వైద్య గ్రంథము |
23 | జీవా నందనము | ఆనంద రాయ కృతికి అనువాదం, నాటక రూపంలో వైద్యవేదాంతోపాసనలను తెలుపు చిత్రకల్పన | వైద్య గ్రంథము |
24 | సాధన సామాగ్రి | శ్రీ విద్యా ఉపాసకులకు ఉపయోగపడే సాధన రహస్యాలు నాలుగు భాగాలుగా వ్రాసారు | |
పైన చెప్పినవవే కాక దుర్గాస్తుతి, శ్రీ సత్యనారాయణ శర్మ సాధనము,భీమేశ్వర నుతి, దేవపూజారహస్యము, శ్రీ విద్య ఆంధ్ర భాష్యం, శ్రీ సప్తశతి ఉపాసన క్రమము, శివరాత్రి పరతత్వము, శ్రీ రాజ విద్యా గీత, సిద్ధాంత శిఖామణి, సోహమ్ సమాధి, సౌభాగ్యలక్ష్మీ హృదయము, శక్తి పాతము,మొదలైన అపూర్వ గ్రంథాలు కూడా రాశారు. |