ఉండేలు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
క్యాట్ బాల్ ను కాట్ బాల్, కాడ్ బాల్, ఉండేలు అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో slingshot అంటారు.
క్యాట్ బాల్ అనేది చేతితో ఉపయోగించే ఒక చిన్న రక్షణ ఆయుధం.
మన్నికగా Y - ఆకారంలో తయారుచేసుకున్న దీనిని V ఆకారానికి కింది భాగాన పిడికిలితో గట్టిగా పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.
క్యాట్ బాల్ కు పై భాగాన ఉన్న రెండు చివరల పొడవుగా సాగే గుణము ఉన్న రెండు మన్నికయిన రబ్బర్లు కట్టబడి ఉంటాయి. వేరొక వైపు ఉన్న రెండు రబ్బర్లను కలుపుతూ జేబు ఆకారంలో ఉండే ఒక గట్టితోలును కడతారు.
దీని తయారికి సాధారణంగా గట్టి కర్ర లేదా చెక్కను ఉపయోగిస్తారు.
ఉపయోగించే విధానం
మార్చుజేబు ఆకారంలో ఉండే తోలులో తగిన పరిమాణంలో ఉండే చిన్న రాయిని ఉంచి లాగి వదలడం ద్వారా అందులోని రాయి క్యాట్ బాల్ గురిపెట్టిన వైపు వేగంగా, దూరంగా వెలుతుంది.
ఉపయోగాలు
మార్చుపక్షులను, కోతులను తరమడానికి దీనిని ఉపయోగిస్తారు.
చెట్టుకున్న కాయలు కొట్టడానికి దీనిని ఉపయోగిస్తారు.
ప్రమాదాలు
మార్చుపిల్లలు ఒకరిపై ఒకరు తమాషాగా క్యాట్ బాల్ ను ప్రయోగించడం వలన దెబ్బలు తగిలే అవకాశముంది.
సామెతలు
మార్చుపిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ