కార్మోరాంట్ ఫిషింగ్

(ఉకాయ్ నుండి దారిమార్పు చెందింది)

కార్మోరాంట్ ఫిషింగ్ అనగా ఒక సాంప్రదాయక చేపలు పట్టే పద్ధతి, ఈ పద్ధతిలో మత్స్యకారులు కార్మోరాంట్ పక్షులకు చేపలు పట్టి తెచ్చే శిక్షణనిచ్చి వాటిని నదులలో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారు. ఈ చేపలు పట్టే విధానాన్ని "ఉకాయ్" అని కూడా అంటారు. చారిత్రాత్మకంగా, సుమారు సా.శ.960 నుండి జపాన్, చైనాలలో కార్మోరాంట్ ఫిషింగ్ జరిగేది. సా.శ.636 లో పూర్తయిన చైనా సుయ్ రాజవంశం యొక్క అధికారిక చరిత్ర అయిన బుక్ ఆఫ్ సుయిలో పురాతన జపనీస్ చే ఈ పద్ధతి ఉపయోగించబడినదని వర్ణించబడింది. ఈ టెక్నిక్ ఇతర దేశాల్లో కూడా ఉపయోగించారు, కానీ చైనాలో ఈ సాంప్రదాయం అంతరించే దశలో ఉంది.

కార్మోరాంట్ పక్షితో సరస్సులో చేపలు పడుతున్న చైనీస్ జాలరి

శిక్షణ

మార్చు

కార్మొరాంట్ లకు చేపలంటే బాగా ఇష్టం, చేపలను వేటాడి పట్టుకు తినడంలో ఇవి మంచి నేర్పరితనం కలవి. జాలరులు తాడువంటి దానిని కార్మొరాంట్ ల మెడకు ఉచ్చులాగా బిగించి నీళ్లలో వదులుతారు. అప్పుడు నీటిలో చేపను పట్టి మింగబోయిన కార్మొరాంట్ కు ఉచ్చు అడ్డు పడటం వలన మింగలేక పోతుంది. కార్మోరాంట్ గొంతుకు అడ్డుపడిన చేపలను మత్స్యకారుడు తీసుకుంటాడు.

జపాన్ లో

మార్చు

కార్మోరాంట్ ఫిషింగ్ పద్ధతి జపాన్ లో జిపూ సిటీలోని నగారా నదిలో నేటికి పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో చేపలు పట్టడం కష్టమైనప్పటికి, లాభం రాకపోయినప్పటికి సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు, అందుకు జపాన్ ప్రభుత్వం కూడా తన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ఉకాయ్ చేపల వేటను చూసేందుకు పర్యాటకులు జిపూసిటీకి తరలివస్తుంటారు.

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 07-07-2014

[[వర్గం:కార్మొరాంట్స్]]