శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం (బలగ)

(ఉత్తరేశ్వర దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

శ్రీ ఉత్తరేశ్వర స్వామి వారి దేవాలయం,[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం పట్టణంలో బలగ ప్రాంతంలో ప్రతిష్ఠించ బడిన శివాలయం. ఇది నాగావళి నది తూర్పు తీరాన 1850 కు పూర్వమే వెలసిన దేవాలయం. 1909 లో జీర్ణస్థితిలో ఉన్న దేవాలయాన్ని బ్రాహ్మణ పండితుడు సోమంచి కోదండ రామయ్య పునద్దరించాడు.నదికి తరచుగా వచ్చే వరదలు వలన గర్భగుడిలో వుండే శివలింగం, ఆలయ ఆవరణలో వుండే గణపతి విగ్రహం పూర్తిగా మునిగి పోతూ ఉండటం వలన, సోమంచి కోదండరామయ్య ఆధ్వర్యంలో ఆలయ భక్తమండలి బలగ గ్రామం వద్ద ఉండే ఎత్తైన ప్రాంతంలో (ప్రస్తుత బలగ మెట్టు) ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సోమంచి కోదండ రామయ్య నిర్వహించాడు.[2] బలగ మెట్టు వద్ద 1927 ఫిబ్రవరి 6న కోదండరామయ్య పర్యవేక్షణలో నిర్మాణం ప్రారంభమయింది. నాగావళి నది తీరం నుండి 1932 మార్చి 14న అనేకమంది ఎడ్లబళ్ళు, తాళ్ల సహాయంతో శివలింగాన్ని తీసుకువచ్చారు. ఈ దేవాలయానికి బలగ గ్రామ వాసి తంగి వేంకట రామయ్య 1932 అక్టోబరు 16న తన కొబ్బరితోటలో 50 సెంట్ల భూమిని, కొంత డబ్బును దేవాలయ నిర్మాణం కోసం ఉచితంగా ఇచ్చాడు. మొదట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎత్తయిన మండపంలో (ఈ ప్రదేశం ప్రస్తుత కాలంలో బలగ మెట్టుగా పిలువబడుతోంది)  శివలింగం ను సోమంచి కోదండ రామయ్య ప్రతిష్టించాడు. దేవాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భక్తమండలికి కోదండరామయ్య అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీకాకుళం జిల్లాలో గల వ్యాపార ప్రముఖులను, ప్రజానీకంను ఉద్దేశించి కోదండ రామయ్య పలు లేఖలు, కరపత్రాలు వేయించాడు.[2]

శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి ఆలయం వద్ద గణపతి విగ్రహం

ఆలయ అభివృద్ధి

మార్చు

1995 తరువాత స్థానికులు విరాళాలు సేకరించి నవగ్రహ మండపం నిర్మించారు. కార్తీకమాసంలోనూ, శివరాత్రి సందర్భంగా మాఘమాసంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

మూలాలు

మార్చు
  1. "Lord Shiva Temples of Srikakulam District in Andhra Pradesh - శ్రీకాకుళం జిల్లా శివ గుడికళు". shaivam.org. Retrieved 2022-10-20.
  2. 2.0 2.1 Dr Somanchi Sai Kumar (1934-03-14). Sri Uttareswara Swami Vari Temple Balga Srikakulam Document.

వెలుపలి లంకెలు

మార్చు