ఉత్తర కరోలినా వెంకటేశ్వర దేవాలయం
ఉత్తర కరోలినా వెంకటేశ్వర దేవాలయం, అమెరికా, ఉత్తర కరోలినాలోని క్యారీలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ప్రాంతంలోని 21,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తోంది.[1]హిందూ మతం, మానవతా సేవలను ప్రోత్సహించడానికి ఈ దేవాలయం అంకితం చేయబడింది.[2]
ఉత్తర కరోలినా వెంకటేశ్వర దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | ఉత్తర కరోలినా |
ప్రదేశం: | క్యారీ |
అక్షాంశ రేఖాంశాలు: | 35°48′05″N 78°48′19″W / 35.801388°N 78.805369°W |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కళింగ నిర్మాణ శైలీ |
ఇతిహాసం | |
సృష్టికర్త: | నంద్ గోపాల్ సచ్‌దేవా |
చరిత్ర
మార్చురీసెర్చ్ ట్రయాంగిల్‌లో నివసిస్తున్న దక్షిణ భారతీయుల కోసం దక్షిణ భారత శైలిలో ఒక దేవాలయం ఉండాలని 1988వ సంవత్సరం నుండి డిమాండ్ పెరిగింది.[3] ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక హిందూ దేవాలయమిది. 1988, జూలైలో 2.8 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.[1][4] 1999 జనవరిలో భూమిని శుద్ధిచేసి భూమి పూజ నిర్వహించబడింది. 2002లో క్యారీ హిందూ దేవాలయం నిర్మాణానికి జోన్‌ని ఆమోదించింది. దేవాలయ నిర్మాణానికి నిధులు సేకరించాల్సి వచ్చింది.[2] 2.8 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణం తొమ్మిది ఎకరాలకు విస్తరించింది.[2]
నిర్మాణం
మార్చు2007 నాటికి, శ్రీ వేంకటేశ్వర దేవాలయానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్ ఖరారు చేయబడ్డాయి. 2009 ఏప్రిల్ నెలలో నిర్మాణం ప్రారంభమైంది. హిందూ విగ్రహాలను సిమెంటుతో తయారుచేయడానికి భారతదేశం నుండి పద్నాలుగు మంది కళాకారులను రప్పించారు.[2] ఇంజనీర్ నంద్ గోపాల్ సచ్‌దేవా ప్రధాన బిల్డర్ గా ఉంటూ నిర్మాణ కార్యకలాపాలు నిర్వర్తించాడు.[1][2] దేవాలయ నిర్మాణానికి $6 మిలియన్లు ఖర్చయ్యేవి, కానీ చివరికి $3.5 మిలియన్లు మాత్రమే ఖర్చయ్యాయి.[2][4] 2009 మే నెలలో దేవాలయ నిర్మాణ పూర్తయింది.
ప్రారంభం
మార్చు2009 మే 29న ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వరుడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆ మరుసటి రోజు దేవాలయం తెరవబడింది.[3][5] ఈ దేవాలయ ప్రారంభోత్సవానికి పలువురు రాజకీయ నాయకులతోపాటు 10,000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. 9 అడుగుల ఎత్తు, 2 టన్నుల శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం, పద్దెనిమిది ఇతర దేవతలతోపాటు ప్రతిష్ఠించారు. ప్రారంభోత్సవం, శంకుస్థాపన మొత్తం ఖర్చు $1 మిలియన్ కంటే ఎక్కువయింది.[1]
రూపకల్పన
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర దేవాలయం నమూనాలో ఈ దేవాలయం నిర్మించబడింది.[1] దేవాలయ రూపకల్పనలో దక్షిణ భారతదేశంలో ఆచరించే హిందూమతం విభాగాలలో సాధారణమైన దేవతామూర్తిలు, హిందూ విగ్రహాలు ఉన్నాయి.[1] దేవాలయ అంతస్తులు నల్ల గ్రానైట్‌తో నిర్మించబడ్డాయి.[1]
ఇతర నిర్మాణాలు
మార్చుదేవాలయం కోసం కొనుగోలు చేసిన ఆస్తిలో నాన్సీ జోన్స్ హౌస్ ఉంది. క్యారీలోని పురాతన భవనమిది.[6] 2019లో, టౌన్ ఆఫ్ క్యారీ నాన్సీ జోన్స్ హౌస్‌ని శ్రీ వెంకటేశ్వర దేవాలయం కోసం $100,000కి కొనుగోలు చేసింది. క్యారీ దాని చారిత్రక పరిరక్షణ కోసం నిర్మాణాన్ని కొనుగోలు చేసింది.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "A Hindu Temple in Cary". NCPedia. Retrieved 2022-04-06.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Hindu Community Visits New Cary Temple". WRAL. 27 May 2009. Retrieved 2022-04-06.
- ↑ 3.0 3.1 Shimron, Yonat (July 11, 1999). "South Indians to Build a Temple of their Own in Cary". The News and Observer. pp. B1. Retrieved February 26, 2022 – via Newspapers.com.
- ↑ 4.0 4.1 "Sri Venkateswara Temple, North Carolina". indyweek. Retrieved 2022-04-06.
- ↑ "history". SVTempleNC. Archived from the original on 2021-06-25. Retrieved 2022-04-06.
- ↑ 6.0 6.1 "Cary Acquires Oldest Remaining Home – 1803 Nancy Jones House – for Preservation, Rehabilitation". town of cary. 3 May 2019. Retrieved 2022-04-06.