ఉద్యోగుల పించను పథకం

ఉద్యోగుల పించను పథకం 1995 - ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తున్న ౩ పథకాలలో ఒకటి. మిగతా రెండు ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం. భవిష్య నిధి సభ్యులకు పించను సదుపాయం కూడా ఉంది. దీనికి సభ్యులు ఏ మాత్రమూ చెల్లించరు. యజమానులు చెల్లించిన 12% లోనుండి 8.33% మరలించి సభ్యుని పించను ఖాతాకు జమ చేస్తారు. ఆ మొత్తానికి భారత ప్రభుత్వం 1.16% జత చేస్తుంది. ఒక ఉద్యోగి పించను పొందడానికి కనీస సర్వీసు 10 సంవత్సారాలు. సర్వీసు మొత్తం ఒకే సంస్థలో చేయవలసిన అవసరం లేదు. సభ్యత్వ పించనుతో పాటు ఉద్యోగుల పించను పథకం చాలా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం కనీస నెలవారీ పించను రూ. 1,000 గా నిర్ణయించింది.

వితంతు పించను

మార్చు

దురదృష్టవశాత్తూ ఒక సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినట్టైతే అతని వితంతువుకు జీవితాంతం పించను లభిస్తుంది. కనీస సర్వీసు – ఒక నెల . కనీస పించను రూ. 1000/-

పిల్లల పించను

మార్చు

దురదృష్టవశాత్తూ ఒక సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినట్టైతే అతని పిల్లలకు ఇద్దరికి వారికి 25 సంవత్సరాలు వచ్చినంతవరకు పించను అందుతుంది. ఇద్దరి కన్నా ఎక్కువమంది పిల్లలున్నట్టైతే మొదట వయసు రీత్యా పెద్దవారైన ఇద్దరికి, వారికి 25 సంవస్త్రములు వచ్చిన అనంతరం తక్కిన వారికి ఒకేసారి ఇద్దరికి చొప్పున మాత్రం పించను అందుతుంది. కనీస సర్వీసు – ఒక నెల. కనీస పించను రూ.500/-

అనాథల పించను

మార్చు

దురదృష్టవశాత్తూ ఒక సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినట్టైతే, అతనికన్నా ముందు అతని భార్య చనిపోయి పిల్లలు అనాథలుగా ఉన్నట్లయితే ఒకసారి ఇద్దరికి చొప్పున వారికి 25 సంవత్సారాలు వచినంతవరకు పించను అందుతుంది. కనీస సర్వీసు – ఒక నెల. కనీస పించను రూ.750/-

తగ్గించబడిన పించను

మార్చు

సాధారణంగా సభ్యులకు పించను ఇవ్వడానికి అతనికి కనీసం 10 సంవత్సరాల సర్వీసు ఉండాలి, అతని వయసు 58 సంవత్సారాలు దాటి ఉండాలి. కానీ 10 సంవత్సరాల సర్వీసు ఉన్న సభ్యులు వయస్సు 50 సంవత్సరాలు పైబడిన తరువాత తగ్గించబడిన పించను కోరవచ్చు. 58 సంవత్సరాల అనంతరం సభ్యుడు ఎంత మొత్తం పించనుకు అర్హుడో అంత మొత్తంలో, 58 సంవత్సరాలు చేరడానికి ఇంకా ఎన్ని సంవత్సారాలు ఉన్నాయో, ప్రతి సంవత్సరం 4% చొప్పున తగ్గించబడిన మొత్తం సభ్యునికి పించనుగా వస్తుంది. ఉదాహరణకు ఒక సభ్యుడు తన 56వ సంవత్సరంలో పించను పొందాలనుకుంటే, అతను అవే అర్హతలతో 58 సంవత్సరాల అనంతరం ఎంత పించనుకు అర్హుడో అంతమొత్తంలో 57వ సంవత్సరానికి 4 శాతం అనగా 96%, 56వ సంవత్సరానికి 96 శాతానికి మరో 4 శాతం అనగా 92.16% పించనుకు అర్హుడవుతాడు. ఒక సభ్యుడు ఒక ఉద్యోగం వదిలేసిన తరువాత రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉన్నట్లయితే, అతని సర్వీసు 10 సంవత్సరములకంటే తక్కువ ఉన్నట్లయితే తన పించను ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు లేదా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అందచేసే పథక ప్రమాణ పత్రం / స్కీం సర్టిఫికేట్ ద్వారా తన పాత ఉద్యోగం యొక్క పించను ఖాతా లోని మొత్తాన్ని, తన పాత ఉద్యోగం యొక్క సర్వీసును కొత్త ఉద్యోగానికి చెందిన పించను ఖాతాకు తరలించవచ్చు. ఒక సభ్యుడు 10 సంవత్సరాల సర్వీసు అనంతరం ఉద్యోగం మానేస్తే, అతని వయసు 58 సంవత్సరాలు నిండనట్లయితే పించను ఖాతా లోని మొత్తాన్ని ఉపసంహరించుకోవటం వీలుపడదు. ఆ సభ్యుడు 58 సంవత్సారాల అనంతరం నెల వారీ పించాను అందుకోవచ్చు లేదా 50 సంవత్సరముల తరువాత తగ్గించబడిన నెల వారీ పించను కోరవచ్చు.[1][2]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు