ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి.

సాంకేతిక పదాలుసవరించు

ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి[1]:

ఉపమానం
దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం
ఉపమేయం
దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
సమానధర్మం
ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
ఉపమావాచకం
ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం

ఉదాహరణలుసవరించు

  • ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇక్కడ వలె అనునది ఉపమావాచకం. ముఖము ఉపమేయం. చంద్రబింబం ఉపమానం.
  • ఆమె కన్నులు కలువ రేకుల వలెనున్నవి

మూలాలుసవరించు

  1. పి., సందీప్ (11 జూలై 2010). "ఉపమాలంకారము (Simile)". మనోనేత్రం. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 22 October 2015. Check date values in: |date=, |archive-date= (help)