ఉపేంద్ర 2 2015లో తెలుగులో విడుదలైన సినిమా. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జీ నిర్మించిన ఈ సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించాడు.‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్ గా కన్నడంలో ‘ఉప్పి2’ పేరుతో, తెలుగులో ‘ఉపేంద్ర2’ పేరుతో నిర్మించారు.ఉపేంద్ర, క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 ఆగష్టు 2015న విడుదలైంది.[1]

ఉపేంద్ర 2
దర్శకత్వంఉపేంద్ర
స్క్రీన్ ప్లేఉపేంద్ర
కథఉపేంద్ర
నిర్మాతప్రియాంక ఉపేంద్ర
తారాగణంఉపేంద్ర
క్రిస్టినా అకిహివా
ఛాయాగ్రహణంఅశోక్ కశ్యప్
కూర్పుశ్రీ(క్రేజీ మైండ్స్)
సంగీతంగురుకిరణ్
నిర్మాణ
సంస్థ
లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఆర్.ఎస్ ఫిలిమ్స్
విడుదల తేదీ
2015 ఆగస్టు 14 (2015-08-14)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

కాలేజ్ స్టూడెంట్ ఖుషీ (క్రిస్టినా అకిహివా) గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం వర్తమానం గురించి ఆలోచించే మనిషే సరిగ్గా పనిచేసుకుంటూ వెళతాడని ఖుషీకి తన ప్రొఫెసర్ చెబుతాడు. ఈ మాటలకు ఖుషీ చాలా ఆసక్తి చూపి అలాంటి వ్యక్తిత్వమున్న వ్యక్తిని వెతుక్కుంటూ వెళుతుంది. ఓ గ్రామంలో అలాంటి వ్యక్తిత్వం వున్న నువ్వు(ఉపేంద్ర) ఖుషీ కనిపిస్తాడు. నువ్వు ప్రవర్తన నచ్చి ఖుషీ అతడిని ప్రేమిస్తుంది. అయితే అదే సమయంలో శైలజ(పారుల్ యాదవ్) వలన నువ్వు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి? అసలు నువ్వు ఎవరు ? శైలజ ఎవరు? నువ్వు ఎందుకు అలా అయ్యాడు? చివరకు ఏమయ్యింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • ఉపేంద్ర
  • క్రిస్టినా అకిహివా
  • పారుల్ యాదవ్
  • సాయాజీ షిండే
  • సత్యజిత్
  • శోభరాజ్
  • ఆర్.ఎన్. సుదర్శన్
  • నాగరాజ్ మూర్తి
  • టెన్నిస్ కృష్ణ
  • మిమిక్రీ దయానంద్
  • తనిష్క కపూర్
  • సంజయ్ ఆర్యన్
  • వినాయక్ త్రివేది
  • చేతన్
  • తుంకూర్ మోహన్
  • బ్యాంకు జనార్దన్
  • వైజానాథ్ బిరదర్
  • సరోజ శ్రీశైలం
  • సువర్ణ శెట్టి
  • ఊర్మిళ
  • శృతి
  • శ్రీ(క్రేజీ మైండ్స్)
  • మంజయ్య
  • మంజునాథ రావు (అతిధి పాత్రలో)

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
  • నిర్మాత: నల్లమలుపు బుజ్జీ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర
  • సంగీతం: గురుకిరణ్
  • సినిమాటోగ్రఫీ: అశోక్ కశ్యప్
  • ఎడిటర్: శ్రీ(క్రేజీ మైండ్స్)

మూలాలు మార్చు

  1. The Hindu (14 August 2015). "Upendra 2: A full-on indulgence" (in Indian English). Archived from the original on 6 August 2020. Retrieved 11 September 2021.
  2. The Hans India (14 August 2015). "Upendra 2 Telugu movie Review" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపేంద్ర_2&oldid=4016687" నుండి వెలికితీశారు