ఉభయచరము
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉభయచరాలు (ఆంగ్లం Amphibians) జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు. భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్పడిన మొదటి చతుష్పాదులు. వీటి పూర్వ జీవులు ఆస్టియోలెపిడ్ చేపలు.
ఉభయచరాలు | |
---|---|
![]() | |
Western Spadefoot Toad, Spea hammondii | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | ఏంఫీబియా లిన్నేయస్, 1758
|
Subclasses and Orders | |
Order Temnospondyli - extinct |
సామాన్య లక్షణాలుసవరించు
- ఇవి శీతల రక్త లేదా అస్థిరోష్ణ జీవులు.
- ఇవి ద్వంద్వ జీవితాన్ని గడుపుతాయి. ఇవి మంచినీటిలో ప్రజననం జరిపి అక్కడే అభివృద్ధి చెందుతాయి. ప్రౌఢజీవులు చాలా వరకు భౌమ జీవితానికనుకూలంగా పుపుస శ్వాసక్రియ జరిపితే, కొన్ని మాత్రం పాక్షికంగా జలచరజీవనానికి మొప్పలు కూడా కలిగి ఉంటాయి.
- చర్మం మృదువుగా గానీ గరుకుగా గానీ ఉండి, శ్లేష్మగ్రంధులను లేదా పెరోటిడ్ గ్రంధులను కలిగి ఉంటుంది. బాహ్యాస్థిపంజరం లేదు. కానీ ఎపొడా జీవులలో మాత్రం చర్మం క్రింది మధ్యత్వచ పొలుసులు కనిపిస్తాయి. చర్మవర్ణానికి కారణం క్రొమెటోఫోర్లు.
- పుర్రెలో రెండు అనుకపాల కందాలుంటాయి. అందువల్ల దాన్ని 'డైకాండైలిక్ పుర్రె' అంటారు. ఇది శీర్షదరం తో సంధించబడి ఉంటుంది.
- పైదవడ లేదా రెండు దవడలూ చిన్నవిగా ఉండి సమదంతాలను కలిగి ఉంటాయి. నాలుక కొన్నింటిలో బహిస్సారి.
- శ్వాసక్రియ ఊపిరితిత్తుల వల్ల జరుగుతుంది. ఆస్య కుహరం కూడా ప్రౌఢజీవులలో దీనికి తోడ్పడతాయి. డింబకాలలో మాత్రం మొప్పలు ఉంటాయి. జలచరజీవులలో మొప్పలు ప్రౌఢ దశలో కూడా ఉంటాయి.
- రెందు కర్ణికలు, ఒక జఠరిక కలిగిన మూడు గదుల హృదయం ఉంటుంది. దీని ద్వారా మిశ్రమ రక్తం మాత్రమే ప్రవహిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన వృక్క, కాలేయ నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి.
- వృక్కాలు మధ్యవృక్కాలు, మూత్రశయం బాగా పెద్దది. ఇవి యూరియోటిలిక్ జీవులు.
- కపాలనాడులు 10 జతలు. పది నాశికా రంధ్రాలు ఆస్యకుహరంలోకి తెరచుకుంటాయి. మధ్యచెవి మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది. దీనితో పాటు కర్ణభేరి, శ్రోత్రరంధ్రాలు కూడా ఏర్పడతాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ డింబక దశలకు, కొన్ని జలచర జీవులకు మాత్రమే పరిమితమవుతుంది.
- లింగ విభేదన ఉంటుంది. పురుష జీవులకు సంపర్కావయవం లేదు. బాహ్య ఫలదీకరణ. అండాలు తగిన మాత్రం సొనకలిగిన 'మీసో లెసిథల్ అండాలు'. ఉభయచరాలలో జలచర జీవనం గడిపే డింభకం ఉంటుంది. రూపవిక్రియ ద్వారా ఇది ప్రౌఢదశను చేరుకొంటుంది.
వర్గీకరణసవరించు
- ఉపవిభాగం I: స్టీగోసిఫాలియా (Stegocephalia) : వీటి చర్మం పొలుసులతోను అస్థిపలకాలతోను కప్పబడి ఉంటుంది. దీనిలో 5 క్రమములు ఉంటాయి. అనీ విలుప్తజీవులే.
- క్రమం 1: లాబిరింతోడాన్ షియా
- క్రమం 2: ఫిల్లోస్పాండిలి
- క్రమం 3: లెపోస్పాండిలి
- ఉపవిభాగం II: లిస్సేంఫిబియా (Lissamphibia) : దీనిలో బాహ్యాస్థిపంజరం లేని జీవించియున్న ఉభయచరాలు ఉంటాయి. దీనిలో 3 క్రమములు ఉంటాయి.