ఉమాస్వాతి
ఉమాస్వాతి లేదా ఉమాస్వామి సా.శ. 2 నుంచి 5వ శతాబ్దం మధ్యలో జీవించిన ఒక భారతీయ పండితుడు. ఈయన జైనమతానికి సంబంధించిన మూలరచనలు కొన్ని రాశాడు.[1][2] ఈయన తత్వార్థ సూత్ర అనే గ్రంథాన్ని రాశాడు. దీనినే తత్వార్థిగమ సూత్ర అని కూడా అంటారు.[3] ఉమాస్వాతి రాసిన ఈ రచన జైన తత్వానికి సంబంధించి తొలి సంస్కృత రచన. నాలుగు జైన సాంప్రదాయాల వారూ ఆమోదించిన మొట్టమొదటి ప్రామాణికమైన, విపులమైన గ్రంథం కూడా ఇదే.[4][5][6] హిందూ మతానికి వేదాంత సూత్రాలు, యోగ సూత్రాలు ఎలాగో జైనమతానికి ఇవి అలాంటివి.[2][4]
ఉమాస్వాతి | |
---|---|
వ్యక్తిగతం | |
జననం | సా.శ 1 - 5 శతాబ్దం మధ్యలో |
మరణం | సా.శ 2 - 5 శతాబ్దం మధ్యలో |
మతం | జైన మతం |
ప్రముఖ కృషి | తత్వార్థ సూత్ర |
Senior posting | |
Teacher | కుందకుందాచార్యుడు |
ఈయనను శ్వేతాంబర, దిగంబర సాంప్రదాయానికి చెందిన ఇరువురు తమ వాడే అని చెప్పుకుంటారు.[7][4] ఉమాస్వాతి కేవలం జైనమత సాంప్రదాయాలనే కాక కొన్ని శతాబ్దాల పాటు ఇతర భారతదేశ సాంప్రదాయాలను కూడా ప్రభావితం చేశాడు. సా.శ 13-14 వ శతాబ్దానికి చెందిన ద్వైత సిద్ధాంత తత్వవేత్త మధ్వాచార్యుడు ఆయన రచనల్లో ఉమాస్వాతిని ఉమాస్వాతి వాచకాచార్య అని పేర్కొన్నాడు.[8] దిగంబర సాంప్రదాయంలో కొంతమంది ఈయనను కుందకుందాచార్యుల ముఖ్య శిష్యుడిగా భావిస్తారు.[1][9] కానీ కొంతమంది పాశ్చాత్య పండితులు దీనిని వివాదాస్పంగా భావించారు.[10]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Jain 2011, p. vi.
- ↑ 2.0 2.1 Umāsvāti 1994, p. xiii.
- ↑ Umāsvāti 1994, p. xi–xiii.
- ↑ 4.0 4.1 4.2 Jones & Ryan 2007, pp. 439–440.
- ↑ Paul Dundas (2006). Patrick Olivelle (ed.). Between the Empires : Society in India 300 BCE to 400 CE. Oxford University Press. pp. 395–396. ISBN 978-0-19-977507-1.
- ↑ Jaini 1998, p. 82.
- ↑ Vidyabhusana 1920, pp. 168–69.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;finegan221
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ B Faddegon; F W Thomas (1935). The Pravacana sara of kunda Kunda Acarya together with the commentary, Tattva-dipika. Cambridge University Press. pp. xv–xvi.