ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ (పుస్తక దుకాణం)

ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ (ఆగ్లం: Women & Children First) అనేది చికాగోలోని అండర్సన్‌విల్లే పరిసరాల్లోని 5233 నార్త్ క్లార్క్ స్ట్రీట్‌లో ఉన్న ఒక స్వతంత్ర పుస్తక దుకాణం. 1979లో ఆన్ క్రిస్టోఫర్‌సెన్, లిండా బుబన్‌లచే స్థాపించబడిన స్త్రీవాద పుస్తక దుకాణం ఇది. స్థానిక మహిళా రచయితలను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్ధేశం. ఇక్కడ స్త్రీలు, పిల్లల పుస్తకాలతో పాటు ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) లకు సంబంధించిన సాహిత్యం పుస్తకాలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్
రకంపుస్తక దుకాణం
స్థాపన1979
స్థాపకుడుఆన్ క్రిస్టోఫర్సన్
లిండా బుబన్
ప్రధాన కార్యాలయం
చికాగో, ఇల్లినాయిస్
,
యజమానిలిన్ మూనీ
సారా హోలెన్‌బెక్
వెబ్‌సైట్womenandchildrenfirst.com

ప్రత్యేకత

మార్చు

ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాలోని అతిపెద్ద స్త్రీవాద పుస్తక దుకాణాల్లో ఒకటి. దాదాపు 30,000 పుస్తకాలు స్టాక్‌లో ఉన్నాయి.[1]

ఇది క్వీర్ స్నేహపూర్వకత పుస్తకాలతో ప్రసిద్ధి చెందింది.[2][3] అలాగే ఈ పుస్తక దుకాణం లక్ష్యం సమాజంలో మహిళల పనికి మద్దతు ఇవ్వడం కూడా.[4]

ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ స్త్రీవాద సాహిత్య రచనలను మాత్రమే కాకుండా, ఇతర రాజకీయ, ప్రగతిశీల ఉద్యమాలకు సంబంధించిన రచనలపై కూడా దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి పుస్తకాల లభ్యమవుతాయి.[5] స్టోర్ అమ్మకాలలో పిల్లల పుస్తకాలు ఇరవై శాతం ఉండగా ఇతర ప్రసిద్ధ కేటగిరీలు వంట పుస్తకాలు, ఆర్ట్ పుస్తకాలు, విద్య, తల్లిదండ్రులకు సంబంధించి సింహభాగం ఉన్నాయి.[6]

ఇక్కడ డ్రాగ్ క్వీన్ స్టోరీ టైమ్ వంటి పిల్లలకు సంబంధించిన ఈవెంట్‌లు, రచయిత రీడింగ్‌లు.. వగైరా ఈవెంట్స్ తరచుగా నిర్వహిస్తారు. స్టోర్‌లోని ప్రముఖ వక్తలలో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, గ్లోరియా స్టీనెమ్, మార్గరెట్ అట్‌వుడ్, ఆలిస్ వాకర్, స్టడ్స్ టెర్కెల్ ఇతర కార్యకర్తలు, సాహిత్య ప్రముఖులు ఉన్నారు. 2015లో పునరుద్ధరణ జరిపి అదనపు ఈవెంట్ స్థలాన్ని సమకూర్చారు. దీంతో స్థానిక కమ్యూనిటీ సమూహాల కోసం వర్క్‌షాప్‌లు, సపోర్ట్ గ్రూప్‌లు, సామాజిక కార్యకలాపాలతో సహా మరిన్ని కమ్యూనిటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.[7]

మూలాలు

మార్చు
  1. Kogan, Rick (17 July 2014). "Andersonville's Women & Children First Bookstore has new, but familiar, owners". Chicago Tribune. Retrieved 21 May 2020.
  2. Gettinger, Aaron (21 June 2019). "Midwest Traveler: A Pride guide to LGBT Chicago". Star Tribune. Retrieved 21 May 2020.
  3. Perry, Grace (10 February 2017). "Bring the kids to Women and Children First for Story Time with Drag Queens". Time Out. Retrieved 21 May 2020.
  4. Corley, Cheryl (27 October 2013). "One Way For An Indie Bookstore To Last? Put Women 'First'". NPR. Retrieved 21 May 2020.
  5. Wasserman, Melissa (27 March 2019). "Women & Children First marks 40 years with 20 best-sellers". Windy City Times. Retrieved 21 May 2020.
  6. Enjeti, Anjali (9 May 2014). "The Last 13 Feminist Bookstores in the U.S. and Canada". Paste. Retrieved 21 May 2020.
  7. Levitt, Aimee (10 October 2014). "Women & Children First and Sem Co-op are under new management". Chicago Reader. Archived from the original on 11 మే 2021. Retrieved 21 May 2020.