ఉయరే (మలయాళ సినిమా)
ఉయరే (గగనంలో పైపైకి) (2019). ఇది మళయాల సినిమా. ఉయారే (అప్ ఎబోవ్) అనేది మను అశోక్ దర్శకత్వం వహించిన 2019 భారతీయ మలయాళ భాషా థ్రిల్లర్ చిత్రం (అతని తొలి దర్శకత్వం), కథ బాబీ, సంజయ్ రాశారు. సోదరి-త్రయం షెనుగా, షెగ్నా షెర్గా నిర్మించారు.[1] ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ, టోవినో థామస్‌లు సిద్దిక్, అనార్కలి మరికర్, ప్రతాప్ పోతేన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కథ యాసిడ్ దాడి నుండి బయటపడిన ఏవియేషన్ విద్యార్థిని పల్లవి రవీంద్రన్ (పార్వతి) జీవితంపై ఆధారపడింది.[2]2018 నవంబరులో మొదలైన చిత్రీకరణ 2019 జనవరి చివరి నాటికి పూర్తయింది.
Uyare | |
---|---|
దర్శకత్వం | Manu Ashokan |
స్క్రీన్ ప్లే | Bobby–Sanjay |
నిర్మాత | Shenuga Shegna Sherga |
తారాగణం | Parvathy Thiruvothu Asif Ali Tovino Thomas |
ఛాయాగ్రహణం | Mukesh Muraleedharan |
కూర్పు | Mahesh Narayanan |
సంగీతం | Gopi Sundar |
నిర్మాణ సంస్థలు | SCube Films Grihalakshmi Productions |
పంపిణీదార్లు | Kalpaka Films Indywood Distribution Network |
విడుదల తేదీ | 26 ఏప్రిల్ 2019 |
సినిమా నిడివి | 125 minutes |
దేశం | India |
భాష | Malayalam |
కథ
మార్చుపల్లవి పైలట్ గా శిక్షణ తీసుకొంటోంది. అసూయాపరుడైన ఆమె పూర్వమిత్రుడు ఆమె మఖంమీద యాసిడ్ పోసి పారిపోతాడు. అద్భుతమైన ఆమె కల, జీవితం ఒక్కసారిగా కూలిపోతుంది. ఒకవైపు ఆమె మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం, యాసిడ్ పోసిన గోవిందుకోర్టు విచారణకు హాజరవడం, వీటిమధ్య సతమతమైపోతుంది. గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్న యువతి, స్నేహితులు, తండ్రి ఆమె వెనక నిలబడతారు. మొదట్లో "వికృతమైన" ముఖంతో ఎన్నో అవమానాలు భరించవలసి వస్తుంది. మరొకవైపు తన జీవితం నాశనంకాకుండా కేసు వెనక్కి తీసుకోమని నేరస్థుని వేడికోళ్ళు. చివరకు ప్రత్యక్ష సాక్ష్యం లేదనే కారణంతో నిందితుడిమీద కేసు కిందికోర్టులో కొట్టివేస్తారు.
ఆమె ఒక విమాన సంస్థలో ఎయిర్ హోస్టెస్.గా చేరుతుంది. తొలి(మెయిడెన్) ఫ్లయిట్లోనే ఆమె మఖంమీద యాసిడ్ పోసిన గోవిందు విమానంలో తారసపడి అప్రస్తుత ప్రసంగం చేస్తాడు. వళ్ళు మండి చేతులో కాఫీకప్పు వాడిముఖంమీద కుమ్మరిస్తుంది. విమానంలో ప్రయాణీకులు తీవ్రంగా అసమ్మతి తెలుపుతారు.
ఇంతలో సీనియర్ పైలట్ హృద్రోగంతో స్పృహ కోల్సోతాడు. సహాయ పైలట్ రెండోసారే విమానం నడపడం. ఆతను బెంబేలుపడతాడు. విమానంలో ఎవరైనా పైలట్ ఉన్నారాంటే ఎవరూలేరు. ఆపరిస్థితుల్లో పల్లవి పైలట్ బాధ్యత ధైర్యంగా నిర్వహించి విమానాన్ని క్షేమంగా కిందకు దింపుతుంది. దర్శకుడి తొలి చిత్రం. ఎంతో సంయమనంతో మెలోడ్రామా లేకుండా తీశాడు. పాత్రధారులు అందరూ సినిమా మాధ్యమాన్ని చక్కగా అర్థంచేసుకొని పాత్రలకు తగినట్లు సంయమనంతో నటించారు.
పల్లవికి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యజమాని కుమారుడు ఆమెపట్ల ఆకర్షితుఢైనా పల్లవి తమస్నేహాన్ని స్నేహంగా మాత్రమే కొనసాగిస్తుఃది. సినిమా ఓపెన్ ఎండింగ్ కనుక వాళ్ళిద్దరూ భవిష్యత్తులో పెళ్ళి చేసుకోవచ్చు. యాసిడ్ పోసిన యువకుడు చివర తనంతట తానే కారుకు తనబండిని గుద్ది చావుబతుకుల మధ్య ఉంటాడు. కోర్ట్ కేసు సాగుతున్న సమయంలో పల్లవిని తాను పెళ్లి చేసుకుంటానని, కేసు తీసేసుకోమని అతను ప్రతిపాదన తెస్తాడు. అత్యాచారం కేసుల్లో నిందితుడు బాధితురాలిని పెళ్ళాడడం పరిష్కారం కాదు. పల్లవి తిరస్కరించింది. చిన్న మార్కెట్ మలయాళ సినిమాను కాపాడిందో లేక వారి చదువు, సంస్కారం సినిమా స్థాయిని రక్షించిందో!
మూలాలు
మార్చు- ↑ "Uyare trailer: The sky's the limit for Parvathy". The Indian Express. 17 April 2019.
- ↑ "In Malayalam film 'Uyare', an acid attack survivor faces up to tragedy with courage". scroll.in. 21 April 2019.