ఉర్ఫీ జావేద్
ఉర్ఫీ జావేద్ (ఆంగ్లం: Uorfi Javed) (జననం 1997 అక్టోబరు 15) ఒక భారతీయ టెలివిజన్ నటి.
వ్యక్తిగత జీవితం
మార్చుఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1997 అక్టోబరు 15న ఉర్ఫీ జావేద్ జన్మించింది.[1] ఆమె లక్నోలోనే చదువు పూర్తి చేసింది. సిటీ మాంటిస్సోరి స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. అమిటీ యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పొందింది.[2] 2017 నుంచి ఒక సంవత్సరం పాటు ఆమె మేరీ దుర్గా సహనటుడు పరాస్ కల్నావత్‌తో డేటింగ్ లో ఉంది.[3] 2022లో న్యూమరాలజిస్ట్ సలహా మేరకు తన పేరు ఉచ్ఛరణ మారకుండా స్పెల్లింగ్‌లో మార్పు చేసుకుంది.[4][5][6]
కెరీర్
మార్చు2016లో సోనీ టీవీ ప్రసారం చేసిన బడే భయ్యా కి దుల్హనియాలో అవనీ పంత్‌గా ఉర్ఫీ జావేద్ ఆలరించింది.[7] ఆమె స్టార్ ప్లస్ లో 2016 నుండి 2017 వరకు చంద్ర నందినిలో ఛాయా పాత్ర పోషించింది. ఆ తర్వాత స్టార్ ప్లస్ ప్రసారం చేసిన మేరీ దుర్గాలో ఆమె ఆర్తి పాత్ర పోషించింది.[8] 2018లో ఆమె సబ్ టీవి సాత్ ఫెరో కి హేరా ఫెరీలో కామినీ జోషిగా, కలర్స్ టీవి బేపన్నాలో బెల్లా కపూర్‌గా, స్టార్ భారత్ జిజి మాలో పియాలీగా అలాగే &టీవి దయాన్‌లో నందినిగా నటించింది.[9][10] 2020లో యే రిష్తా క్యా కెహ్లతా హైలో శివాని భాటియాగా ఆమె చేసింది.[11] ఆ తర్వాత కసౌతి జిందగీ కేలో తనీషా చక్రవర్తిగా ఆమె నటించింది.[12] ఆమె బిగ్ బాస్ OTT మొదటి సీజన్‌లో పోటీ పడింది.[13] 2022లో కున్వార్‌తో కలిసి ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది.[14][15]
ఫిల్మోగ్రఫీ
మార్చుటెలివిజన్
మార్చుYear | Show | Role | Ref(s) |
---|---|---|---|
2016 | బడే భయ్యా కి దుల్హనియా | అవనీ పంత్ | |
2016–2017 | చంద్ర నందిని | యువరాణి ఛాయా | |
2017 | మేరీ దుర్గా | ఆర్తి సింఘానియా | |
2018 | సాత్ ఫేరో కీ హేరా ఫెరీ | కామినీ జోషి | |
బేపన్నాః | బెల్లా కపూర్ | ||
జిజి మా | శ్రావణి పురోహిత్/ పియాలీ సెహగల్ | ||
2018–2019 | దయాన్ | నందిని | |
2020 | యే రిష్తా క్యా కెహ్లతా హై | అడ్వోకేట్ శివాని భాటియా | |
కసౌతి జిందగీ కే | తనీషా చక్రవర్తి | ||
ఆయ్ మేరే హమ్సఫర్ | పాయల్ శర్మ | [16] |
వెబ్ సిరీస్
మార్చుYear | Show | Role | Ref(s) |
---|---|---|---|
2021 | పంచ్ బీట్ 2 | మీరా | [17] |
బిగ్ బాస్ OTT | పోటీదారు |
మూలాలు
మార్చు- ↑ Grace Cyril (December 23, 2021). "I don't believe in Islam, I am reading the Bhagavad Gita, says Urfi Javed". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-04-12.
- ↑ Cyril, Grace (29 November 2021). "Who is Urfi Javed and why is everyone talking about her?". India Today.
- ↑ Kumar, Aakash (2018-04-26). "'Meri Durga' actors Paras Kalnawat and Urfi javed no more together!". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-04.
- ↑ "Actress Urfi Javed Changes her Instagram Bio Name to Uorfi". news18.com. 7 May 2022.
- ↑ "Urfi Javed changes her name to Uorfi". indiatimes.com. 10 June 2022.
- ↑ Grace Cyril (11 June 2022). "Urfi Javed reveals why she changed her name to Uorfi". indiatoday.in.
- ↑ "Urfi Javed sets hearts racing with these bold pictures". Times of India (in ఇంగ్లీష్).
- ↑ "Meri Durga actors Urfi Javed and Vicky Ahuja join &TV's Daayan". Tellychakkar (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-06. Retrieved 2022-08-11.
- ↑ "This actress is all set to enter Jennifer Winget and Harshad Chopda's Bepannaah". India Today (in ఇంగ్లీష్).
- ↑ "Charu Asopa replaces Urfi Javed in 'Jiji Maa'". The Times of India.
- ↑ "Yeh Rishta Kya Kehlata Hai: Urfi Javed to enter as Trisha's lawyer". ABP Live (in ఇంగ్లీష్). 23 February 2020.
- ↑ "Urfi Javed to enter Kasautii Zindagii Kay post leap". ABP Live (in ఇంగ్లీష్). 3 March 2020.
- ↑ "Urfi Javed Wears A 'Single Knot' Top Exposing Her Assets, Gets Trolled "Urfi Presents The Great Indian Circus"". Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-01. Retrieved 2022-03-01.
- ↑ "Befikra (Official Video) - Kunwarr ft. Urfi Javed - Dhruv G - New Punjabi Songs 2022". Youtube.
- ↑ "Urfi Javed - बीबी ओटी फेम उर्फी जावेद अपने गाने 'बेफिक्रा' के प्रचार में नजर आए". Tollywood Life Facebook.
- ↑ "Urfi Javed surprises her co-actors with some healthy food". The Times of India.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Sana Farzeen (29 June 2021). "Puncch Beat 2 first impression: The curse of second season takes down Siddharth Sharma-Priyank Sharma show". indianexpress.com. Retrieved 29 November 2021.