ఉషాదేవి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె చికిటి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గృహ & పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1][2]

ఉషా దేవి
ఉషాదేవి


గృహ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
ముందు చింతామణి ధ్యాన్ సమాంతర
నియోజకవర్గం చికిటి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-02-25) 1952 ఫిబ్రవరి 25 (వయసు 72)
భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
బంధువులు సచ్చిదానంద నారాయణ్ దేబ్ (మామయ్య)
నివాసం భుబనేశ్వర్, ఒడిశా
వృత్తి రాజకీయ నాయకురాలు
వృత్తి సామజిక సేవ

రాజకీయ జీవితం

మార్చు

ఉషాదేవి తన మామయ్య సచ్చిదానంద నారాయణ్ దేబ్ అడుగుజాడల్లో జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1990లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో చికిటి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 1995లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం బిజూ జనతా దళ్ పార్టీలో చేరింది. ఉషాదేవి ఆ తరువాత 2000లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తరువాత వరుసగా 2005, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

మంత్రిగా

మార్చు
శాఖ నుండి వరకు
టెక్స్టైల్ & హ్యాండ్లూమ్, శాస్త్ర & విజ్ఞాన మంత్రి 10 మే 2011 10 ఫిబ్రవరి 2012
టెక్స్టైల్ & హ్యాండ్లూమ్, ప్లానింగ్ & కోఆర్డినేషన్ శాఖ మంత్రి 10 ఫిబ్రవరి 2012 02 ఆగష్టు 2012
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి 02 ఆగష్టు 2012 06 మే 2017
ప్లానింగ్ & కన్వర్జెన్స్, వృత్తి నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి 07 మే 2017 29 మే 2019
గృహ & పట్టణాభివృద్ధి శాఖల మంత్రి 2022 జూన్ 5 ప్రస్తుతం

మూలాలు

మార్చు
  1. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. The Hindu (5 June 2022). "Odisha CM Naveen Patnaik reconstitutes Council of Ministers" (in Indian English). Archived from the original on 8 July 2022. Retrieved 8 July 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉషాదేవి&oldid=3597722" నుండి వెలికితీశారు