ఉస్మానియా కళాశాల (కర్నూలు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఒక కళాశాల

ఉస్మానియా కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఒక కళాశాల. ఇది కర్నూలులోని మొదటి డిగ్రీ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతన కళాశాల. ఈ కళాశాల 2010 నుండి కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాలగా ఉంది.[2][3]

ఉస్మానియా కళాశాల
నినాదంలీడ్ కైండ్లీ లైట్
రకంఎయిడెడ్
స్థాపితం1947
వ్యవస్థాపకుడుడాక్టర్ ఎం. అబ్దుల్ హక్
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ సయ్యద్ సమియుదున్ ముజమ్మిల్
డైరక్టరుశ్రీమతి అజ్రా జావేద్
చిరునామకర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
15°49′37″N 78°02′49″E / 15.827°N 78.047°E / 15.827; 78.047[1]
కాంపస్పట్టణ
అథ్లెటిక్ మారుపేరుఓసికె
అనుబంధాలురాయలసీమ విశ్వవిద్యాలయం

చరిత్ర మార్చు

1947లో డాక్టర్ ఎం. అబ్దుల్ హక్ ఈ కళాశాలను స్థాపించాడు. ఈ కళాశాల స్థాపనకు హైదరాబాదు నిజాం - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.[4] దీనికి 1956లో యుజిసి చట్టం సెక్షన్ 2 (ఎఫ్), 12 (బి) కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి గుర్తింపు లభించింది. ఇది మైనారిటీ సంస్థ.[5]

సదుపాయాలు మార్చు

9.5 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ కళాశాలలో పురాతన నైతిక చిత్రాలు, కొన్ని అరుదైన పుస్తకాలతో పెద్ద గ్రంథాలయం ఉంది.[6] ఉస్మానియా కళాశాల మైదానం కూడా ఉంది.

కోర్సులు మార్చు

  1. హ్యుమానిటీస్
  2. సోషల్ సైన్స్
  3. సైన్స్
  4. కామర్స్
  5. మేనేజ్‌మెంట్
  6. కంప్యూటర్ అప్లికేషన్స్‌
  7. ఎం.ఏ (ఇంగ్లీష్ లిటరేచర్)
  8. ఎం.ఎస్.సి. (ఫిజిక్స్)
  9. ఎం.ఎస్.సి. (సేంద్రీయ కెమిస్ట్రీ)
  10. ఎం.కాం. (ప్రొఫెషనల్)

మూలాలు మార్చు

  1. "15.827207,78.047558". Google Maps. Retrieved 2021-05-24.
  2. "List Of P.G. Colleges with College Codes" (PDF). Rayalaseema University. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2021-05-24.
  3. Handbook of Universities. Atlantic Publishers & Dist. 2006. pp. 791–. ISBN 978-81-269-0608-6.
  4. "Osmania College founder remembered". 19 February 2008. Archived from the original on 26 March 2014. Retrieved 2021-05-24.
  5. "Osmania College celebrates Founder's Day". 22 February 2011. Retrieved 2021-05-24.
  6. "Osmania College (Autonomous), Kurnool". official website. Retrieved 2021-05-24.

బయటి లింకులు మార్చు