వరి పంటలో గింజలు ముదిరాక ఎలుకలు బాధ రైతులు ఎదుర్కొంటున్నారు. ఎలుకలు గట్టుల్లో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచు కుంటాయి. వీటి వలన రైతుకు చాలా పంటనష్టం కలుగుతుంది. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది.

గతంలో "ఇర్ల వాళ్ళు" ఎలుకలను పట్టడాని పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితే అందులోకి పొగ పెట్టి త్రవ్వి ఎలుకలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. పొగ పెట్టడాన్ని ఊదర పెట్టడం అంటారు. ఒక చిన్న మట్టి కుండకు కింది వైపున చిన్న రంధ్రం చేస్తారు. ఆ కుండలో పిడకలు కొన్ని వేసి నిప్పుపెట్టి దాని నిండుకు కొంత గడ్డిని, పచ్చి ఆకులను వేసి కుండ మూతిని ఎలుక బొరియకు బోర్లించి చుట్టు మట్టి కప్పి వెనక వున్న రంధ్రంద్వారు గాలిని ఊదుతారు. అప్పుడు దట్టమైన పొగ ఎలుకల బొరియలంతా వ్వాపిస్తుంది. ఊపిరాడని ఎలుకలు ఎక్కడో ఒక చోట బయటకు వస్తాయి . అప్పుడు వాటిని పట్టుకుంటారు. కొన్ని ఊపిరాడక లోపలే చనిపోతాయి. ఆ బొరియలను త్రవ్వి చనిపోయిన ఎలుకలను పట్టు కుంటారు. ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకుతుంది.

ఇప్పటికీ వీరు ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా ఎలుకలు, పిట్టలను పడుతున్నారు. ఈ ఇర్ల వాళ్ళు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

ఎలుకల నివారణ