ఎండుగడ్డి
ఎండుగడ్డిని చొప్ప అని కూడా అంటారు. ఇది ఒక వ్యవసాయ ఉత్పత్తి, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి మొక్కల నుండి ధాన్యాన్ని సేకరించిన తరువాత ఎండిన కాండాలను ఎండుగడ్డి అంటారు. ఎండుగడ్డిని ఆంగ్లంలో స్ట్రా (Straw) అంటారు. ఎండుగడ్డి ధాన్యజాతి పంటలైనటు వంటి బార్లీ, వోట్స్, వరి, రై, గోధుమల నుండి సగం పైనే దిగుబడి వస్తుంది. ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా, ఇంటి పైకప్పుగా, బుట్టలు తయారీకి, ఉపయోగపడుతుంది. వీటిని దగ్గరగా చుట్టి నిల్వ చేస్తారు. వీటిని ఒక తీగతో చుట్టి బేల్స్ గా తయారుచేస్తారు. వీటిని దీర్ఘచతురస్రాకారంగా గానీ, గుండ్రంగా గానీ వాటి ఉపయోగానికి తగినట్లు తయారుచేసి భద్రపరుస్తారు.
ఉపయోగాలు
మార్చుపశుగ్రాసం
మార్చుఎందు గడ్డిని పశువులకు లేదా గుర్రాలకు పశుగ్రాసంగా వినియోగిస్తారు. దీనివలన వాటికి అవసరమైన శక్తిని తగిన రీతిగా అందించబడుతుంది. ఇది వేగంగా జీర్ణంచెసుకోగల ఆహారం. ఈ ఆహారం వల్ల సూక్ష్మ వ్యవస్థల కారణంగా ఉష్ణం వెలువడి అది శీతల ప్రాంతంలో గల పశువులకు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. దీనిలో అతి తక్కువ పోషక పదార్థాలు ఉన్నందువల్ల దీనిని ఆహారంగా నిషేధించారు. కానీ దీనిని చిన్న ముక్కలుగా చేసి ఆహారంగా పెడతారు. దీనిని తవుడు అనవచ్చును.
బుట్టల తయారీకి
మార్చు- నార బుట్టల తయారీకి ఎండుగడ్డిని సరైన పొడవులతో వరుస క్రమంలో ఉంచి తయారుచేస్తారు. ఈ పరిజ్ఞానాన్ని లిప్ వర్క్ అంటారు.
పరుపులుగా
మార్చు- మనుష్యులకు గానీ, జీవించే జంతువులకు గానీ బెడ్డింగ్ గా ఉపయోగపడును.
- ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఎండుగడ్డితో మెత్తలుగా తయారుచేస్తున్నారు.
- ఇది సాధారణంగా నెమరువేసే జంతువులు, గుర్రాలకు బెడ్డింగ్ గా ఉపయోగిస్తున్నారు. దీనిని చిన్న జంతువులకు ఆహారంగా, బెడ్డింగ్ గా ఉపయోగిస్తున్నారు. కానీ తరచుగా వాడిగా గల ఎండుగడ్డి వల్ల నోటికి, ముక్కుకు, కళ్ళకు గాయపరుస్తుంది.
జీవ ఇంధనంగా
మార్చుఎండు గడ్డిని కార్బన్-న్యూట్రల్ శక్తి వనరుగా ఉపయోగించవచ్చు. ఇది "బయో బ్యుటనోల్"ను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. ఎండుగడ్డితో చుట్టిన దిమ్మలు బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.
జీవ ద్రవ్యరాశిగా
మార్చునిర్మాణ సామాగ్రిగా
మార్చుమృత్తికా క్రమక్షయం నివారించుటకు
మార్చుటోపీలకు
మార్చుఉద్యానవన పనికి
మార్చుపేకింగ్ కొరకు
మార్చుకాగితం తయారీకి
మార్చుతాళ్ళ తయారీకి
మార్చుచెప్పుల తయారీకి
మార్చుయింటి పైకప్పుకు
మార్చుచిత్రమాలిక
మార్చు-
వృత్తాకారంలో చుట్టబడిన పెద్ద గడ్డి మోపులు
-
వరిచెత్త (వరిగడ్డి) మోపులు
-
వాము వలె అమర్చిన చిన్న చదరపు గడ్డి మోపులపై కప్పిన టార్పలిన్ పట్ట (tarpaulin)
-
ఎండుగడ్డి మోపులు బొగ్గుకు ప్రత్యామ్నాయ జీవఇంధనంగా ఉన్నాయి
-
బెలారసియన్ ఎండుగడ్డి పక్షి
-
సంప్రదాయ లాట్వియన్ ఎండుగడ్డి అలంకరణ